వృషభ రాశి జనన సాధారణ ఫలితాలు
ఏప్రియల్ 21 నుండి మే 20 వరకు పుట్టినవారు వృషభరాశిగా పరిగణించ బడతారు.
కృత్తిక 2,3,4 పాదాలు ,రోహిణి 4 పాదాలు ,మృగశిర 1,2 పాదాలు వృషభరాశి
వృషభ రాశి జాతకులు వ్యవహార శీలురు. స్థిర, గంభీర స్వభావాలు కలిగి ఉంటారు. సౌందర్య ప్రియులు.
శిష్ట వ్యవహారం పై మక్కువ వీరు ధనము, కీర్తిని కూడా సంపాదిస్తారు. వీరు సర్జన్, ఉపాధ్యాయులు రచయితలుగా ఉంటారు. వీరు ఉపేక్షను ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో అపజయం ఎదురవుతూ ఉంటుంది. వీరు స్వాభావికంగా నిజాయితీ కలవారు. పర స్త్రీ వ్యామోహం అధికం మర్యాదతో ప్రవర్తిస్తారు. వీరి శ్రమను ఇతరులు అనుభవిస్తారు. వీరికి సాధారణ వ్యక్తులనుండి విశిష్టమైన వ్యక్తుల వరకూ పరిచయం ఉంటుంది. వీరికి సమాజంలో, రాజనీతిలో ప్రాముఖ్యం అధికం
వీరు వ్యవసాయం ,చిత్రకళ, వస్త్ర వ్యాపారం, స్టేషనరీ ,తేనె, బియ్యం, అపరాల వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. రాజకీయాల్లో ఉంటే మంత్రి పదవిని పొందే అవకాశములు ఉంటాయి.
వృషభ రాశివారికి 12 సం||ల నుంచి అదృష్టం ప్రారంభమౌతుంది. వీరి జీవితంలో 15,24,33,42,51,60 సం||లు కలసి వచ్చే కాలము. ఈ రాశి జాతకులు తెల్ల చందనం , తెల్ల బియ్యం ,తెలుపు వస్త్రాలు ,నెయ్యి ,వెండి, చక్కెర , బన్సి గోధుమలు శుక్రవారము రోజున రోగ నివృత్తికై దానము చేయండి ఆరోగ్య వృద్ధి కలిగించును.
ఈ రాశివారికి అనుకూలమైన రత్నం వజ్రం ఈ రత్నం ప్రత్యామ్నాయం గా తెల్ల పుష్యరాగం, మూన్ స్టోన్ ధరించ వచ్చును.
వీరికి భాగస్వామ్య వ్యాపారం అనుకూలం కాదు. మీకు కొత్త వారివలన ఇబ్బందులు కలిగించును. పెద్దల సహాయం వలన మీకు కలిగే సమస్యలు పరిష్కారం లభిస్తుంది.
ఈ రాశివారు శుక్రవారం వ్రతం చేస్తే మంచిది. శనివారం ఉపవాసం చేయాలి ,సుందరకాండ పారాయణం చేయాలి. వీరు గుండ్రని ముఖంతో అందంగా ఉంటారు.
వీరు గుండ్రని ముఖంతో అందంగా ఉంటారు. వీరు శీలవంతులు, గుణవంతులు, జ్ఞాన వంతులు స్వతంత్ర ఆలోచనను కలిగి ఉంటారు. ఇతరులకు మేలు చేకూర్చేవారు. వీరికి జీవితంలో సుఖం తక్కువ స్త్రీలు భర్తను ప్రేమిస్తారు. పురుషులు భార్యను ప్రేమిస్తారు. వీరికి పేరు ప్రతిష్టలు ఎక్కువ వృషభ రాశివారికి భార్య మంచి శీలవతి ,పుత్రులు కలిగి ,విద్యను భర్తను ప్రేమిస్తుంది. ఈ రాశి భూ తత్వమును, స్థిరత్వమును కలిగి ఉండి. శుక్రుడు అధిపతిగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు విశాలమైన నుదురు. చక్కని తీరైన మేడ, నల్లనైన శిరోజములు, చక్కని ఆకర్షణీయమైన శారీరక సౌష్టవముతో ఉంటారు. వీరు దాయార్ద్ర హృదయులు , సున్నితమైన వారు సహనము, లక్ష్యమును కలిగి ప్రయోగాత్మకంగా నిజాయితీగా మరియు ఆధారపడదగిన వారుగా ఉంటారు. అద్భుతమైన సహనము, ఆత్మ శక్తులను కలిగి ఉంటారు. కఠోర శ్రమను చేయగలిగే ఉంటారు. పనిని నిదానంగా, సులభ మార్గంలో పూర్తిచేస్తారు.
స్నేహితుల పట్ల నిజాయితీగా ఉన్నా శతృవర్గము వారితో సున్నితమైన వైరి భావంతో వ్యవహరిస్తారు. వీరియొక్క ఉల్లాస తత్త్వము, సులభ శైలి, ఉదారత్వముల అనేకులైన వారితో చక్కని ఉల్లాస పోషక అంశాలు. సాధారణంగా వీరు నిజాయితీ తేలికగా ఆధారపడదగిన వారై ఉంటూ. అదే సమయంలో రాజనీతి జ్ఞతతో వ్యవహరిస్తారు. వీరు తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవడంలో అదృష్టవంతులై, వారు పనిచేసే చోట అధికారాన్ని ప్రదర్శించే వారుగా ఉంటారు.
వీరు చక్కని సంపదలను, జీవితంలో అన్నీ విధాలైన సుఖ సౌఖ్యాలను అనుభవిస్తారు. మంచి ఆర్థిక హోదాలను కూడా కలిగి ఉంటారు. వీరికి దూరదృష్టి, చొరవ కలిగి ఉన్న వీరు స్వయంగా నిర్ణయాలను గైకునే శక్తిని కలిగి ఉంటారు. విద్యలో చక్కని ప్రతిభను కలిగి ఉన్నా, ఇబ్బందులచే సతమత మౌతు ఉంటారు. దీనిచే వీరు వారి తల్లిదండ్రులకు అధిక ఆర్థిక ఇబ్బందులను కలిగించే వారై ఉంటారు. అందువలన వీరు వారి తల్లి దండ్రులకు అధిక ఆర్థిక ఇబ్బందులను కలిగించే వారై ఉంటారు. వీరికి ఆర్థిక శాస్త్రము ,రసాయన శాస్త్రము ఇంజనీరింగ్ , వ్యవసాయము వంటి రంగాలు అనుకూలిస్తాయి.
వీరికి శుక్రుడు అధిపతి కావటం వలన ఎక్కువగా బౌతీక పరమైన సుఖ సౌఖ్యాలకే వీరు అధిక ప్రాధాన్యత నిస్తూ కృషి చేస్తూంటారు. వీరు సహకారము, సంఘాలు భాగస్వామ్య పద్దతుల ద్వారా మంచి ఆర్థిక స్థితిని అనుభవించే వారై ఉంటారు.
వీరికి భూములు ,గనులు, లోహములు వంటి అంశాలు లాభదాయకమై ఉంటాయి. భావన నిర్మాణ స్కీములు ,ఆస్తుల నిర్వహణ అనగా రెష్టారెంట్లు ,హోటల్లు ఇంటీరియర్ డిజైన్, సాఫ్ట్ వేర్ రంగం వంటి వ్యాపారాలు లాభాకరమైనవిగా ఉంటాయి. మరియు ఆధ్యాత్మిక రంగములో అనగా వేదము , పౌరోహిత్యము శాస్త్ర జ్ఞానము కలిగి ఉంటారు. వీరు ధనము విలువను అవగతం చేసుకున్నవారు. జీవితానికి భద్రత ముఖ్యమని వీరి యొక్క ప్రగాఢ నిర్ణయం ఈ రాశి జాతకులు తమ స్వంత వ్యాపారాన్ని , తను చేస్తున్న ఉద్యోగములో బాగా ఉన్నత స్థితికి వచ్చినను వీరిలో అధిక శాతం మంది ఇతరుల కోసం కూడా ఆయా సహాయ సహకారాల్ని అందించే వారు ధార్మిక గుణం కలిగి ఉంటారు.
వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు అద్భుతమైన సౌందర్యాన్ని కలిగి ఉంటారు. మోడలింగ్ రంగములో రాణిస్తారు. వీరిలో సంగీత వేత్తలు ,గాయకులు కూడా ఉంటారు. వీరు ప్రయోగాత్మకంగా ఆలోచించే స్వభావాన్ని కలవారవడంతో తమ లక్ష్యాన్ని సాధించడంలో మంచి అవకాశాలను కలిగి ఉంటారు.
వృషభ రాశివారు అద్భుతమైన శారీరక దృఢత్వము , ఆరోగ్యాలను కలిగి ఉంటారు. అనారోగ్యమనేది వీరికి చాలా అరుదుగా కలుగుతుంది. వీరికి గొంతు సంబంధ అంశాలలో టాన్సిల్స్,చెవి మరియు ముక్కు సంబంధించిన సమస్యలు ,మలబద్ధకము వంటి ఆరోగ్య సమస్యలు సంభవించ వచ్చు. వీరు రక్తపోటు ,మధుమేహము వంటి వ్యాధుల విషయంలో జాగ్రత్తగా మసలుకోవాలి. వీరు అధికంగా తినటం, తాగటం వంటివి నివారించాలి. ప్రతిరోజూ యోగ ,శారీరక వ్యాయామం చేయుట వలన శారీరక ఆరోగ్యము మెరుగైన స్థితిలో ఉంటారు.
వృషభ రాశివారు కన్య,మకర రాశుల వారితో వివాహ సంబంధముల వలన ప్రశాంతమైన వైవాహిక జీవనాన్ని కలిగి ఉంటారు.
ఈ రాశివారు ప్రేమలో ఉన్నత భావాల్ని కలిగి ఉండి వివాహానికి స్వల్ప ప్రాధాన్యతనే ఇస్తారు. వీరి భాగస్వామి శృంగార సంబంధ అంశాలలో సహజంగా అధిక సహకారాన్నే అందిస్తారు. వీరు సాధారణంగా ప్రశాంతమైన ఉల్లాసమైన మంచి జీవనాన్ని కలిగి ఉంటారు.
గమనిక : వృషభ రాశి లో జన్మించిన వారికి సాధారణంగా పై ఫలితాలు వర్తిస్తాయి. మీ పూర్తి భవిష్యత్ ఫలితాలు దశా అంతర్దశ ఫలితాల కొరకు. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యను వ్రాసి మీ పూర్తి పేరు జన్మ తేదీ , జన్మ సమయం, జన్మ స్థలము, వివరములతో సంప్రదించండి. మీ మెయిల్ మరియు వాట్సాప్ ద్వారా సంపూర్ణ జాతక పరిహార రిపోర్ట్ పొందండి.