వృశ్చిక రాశి జనన సాధారణ ఫలితాలు
అక్టోబర్ 24 నుండి నవంబర్ 23 లోపు జన్మించిన వారిది వృశ్చిక రాశి
విశాఖ 4 వ పాదము , అనూరాధ 4 పాదాలు ,జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉండి ఇతరులను సూదంటు రాయిలాగా ఆకర్షిస్తారు. దానివల్ల ఇతరులు వీరి స్నేహాన్ని కోరుకుంటారు. తమ మాటలను ఇతరులు వినాలని పట్టుబట్టే స్వభావం కల్గినవారు. వీరికి అది,మంగళ, గురువారాలు శుభాన్ని కల్గిస్తాయి. సోమ ,శుక్రవారాలు పనికిరావు వీరికి 1,2,4,7,9 లక్కీ నెంబర్లు.
ఈ రాశివారు జ్యోతిష్యం , తత్త్వశాస్త్రం ,విద్య ,వ్యవసాయంలో రాణిస్తారు. వీరు తెల్లని వస్త్రాలు ధరిస్తే ఇతరులను అధికంగా ప్రభావితం చేయగలరు.
వీరికి 21,27,28,29,35,38,44,54,55,56,64 సం||లు అదృష్ట ప్రదమైనవి. వీరు వృద్ధాప్యంలో హాయిగా జీవిస్తారు. ఈ రాశివారు “ఓమ్ నమో భగవతే వాసుదేవాయ నమః అని రోజు జపం చేయాలి ,శివారాధన ,ఆంజనేయ స్వామికి పూజలు చేయుట వలన శుభములు కలిగించును.
వీరు పెసరపప్పు , గోధుమపిండి, బెల్లం, ఎర్ర చందనం ఎరుపు వస్త్రాలు ఇవి మంగళవారం రోజున దానము చేయుట వలన శుభములు కలుగును.
ఈ రాశి జాతకులకు భార్య ధనవంతురాలు , లేదా వివాహనంతరము ఐశ్వర్య వృద్ధి కలుగును జీవిత భాగస్వామి కార్యశీలురాలై ఉంటుంది. సుఖ సౌఖ్యములు కలుగును
ఈ రాశి జాతకురాలికి ఓర్పు సహనము ఉన్న వ్యక్తి భర్తగా లభిస్తాడు. జీవన పయనంలో ఒకరికోకరు సహకరముతో అభివృద్ధి కలుగును.
ఈ రాశి జాతకులు / జాతకురాలు శనివారము రోజున ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సుందరకాండ పారాయణం చేయాలి పగడం ధరించాలి. ప్రతినెలా 27 వ తేదీన అంగవైకల్యమున్న వ్యక్తికి పరమాన్నంతో కూడిన అన్నదానము చేయాలి. మంగళ వారము రోజున స్వామికి సింధూరము సమర్పించాలిమరియు
వీరికి ఎరుపు ,గులాబీ రంగులు శుభాన్ని కలిగిస్తాయి. వీరికి తూర్పు ,ఉత్తర దిశలు అనుకులమైనవి. నగరం యొక్క తూర్పు భాగంలో నివాసం చెయ్యరాదు.
వీరు స్వేచ్ఛా జీవులు ,మొండివారు, అందంగా ఉంటారు. వృద్ధులను గౌరవంగా చూస్తారు. రసజ్ఞులు, కోపం లోభం , కామం యిత్యాది గుణములు మరియు ప్రేమిస్తే ప్రాణమిచ్చే తత్త్వాన్ని కలిగి ఉంటారు.
వృశ్చిక రాశి భూ తత్త్వాన్ని కలిగిన కుజ గ్రహము అధిపతి ఈ రాశివారు పొడవుగా దృఢ శరీరులై చూచెందుకు ఆజ్ఞల నిచ్చేవారుగా ,ఉత్తేజ పరచేవారై ఉంటారు. వీరు స్వతంత్రత, బాధ్యత,ధైర్యము, సాహసము, హోదా, హుందాతనం, శక్తియుక్తులతో ఇతరులను ప్రభావితం చేసేవారై ఉంటారు. వీరిపైన ఉంచిన పనిని పూర్తి చేసే వరకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. చురుకైన మనోశక్తిని కలిగి, వీరి నూతన ఆశయాలు, ఉద్దేశాలను కలిగి ఉంటారు.వీరు తొందరగా ఉద్రేకాన్ని తెచ్చుకుంటారు. వీరు ఇతరులు మరియు (పురుషులు స్త్రిలచేత , స్త్రీలు పురుషులచేత) చాలా తోoదరగా ఆకర్షింపబడతారు.
ఈ రాశివారు ఇష్టపడిన వారికోసం ప్రాణమిచ్చే తత్త్వాన్ని కలిగి ఉంటారు. మిక్కిలి అధికమైన తెలివితేటను కలిగి విద్య విషయకంగా అధిక ప్రతిభను కలిగి ఉంటారు. వీరు భౌతిక ,రసాయన శాస్త్రం, న్యాయ మనస్తత్వ శాస్త్రం, మరియు ఇంజనీరింగ్ సాఫ్ట్ వేర్ రంగములో రాణిస్తారు. వీరికి సహజంగానే పలు అంశాలలో ప్రతిభ ఉంటుంది.
వీరికి సాధారణంగా మంచి ఆర్థిక స్థితి గతులను కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది వైద్యులు, పరిశోధన, హిప్నాసిష్ట్ , డిటెక్టివ్, జ్యోతిష ,పురోహిత , వేద విద్యలలో ప్రవేశము అభివృద్ధి ఉండును. వీరు నిర్మాణాలు (కన్ ష్ట్రక్షన్ ), గనులు ,భీమా, మెడిసిన్,మొక్కలకు సంబంధించిన వ్యాపారము తత్సంబంధిత పరిశ్రమలలో రాణించగలరు.
ఈ రాశివారు అద్భుత శక్తివంతులై ఉంటారు. వీరికి జననావయవ సంబంధించిన అనారోగ్య సమస్యాలు, చర్మవ్యాధులు, నేత్ర సంబంధ వ్యాధులు కలుగును జాగ్రత్తవహించాలి వీరు తమ జీవిత భాగస్వామికి అన్నీవిధాలైన సుఖ సౌఖ్యాలను. ప్రేమా అభిమానలను పంచి ఇచ్చేవారై ఉంటారు. వీరు తమ రాశివారితో గాని కర్కాటక. మీన రాశుల వారితో చక్కని అద్భుత సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్నచో శుభప్రదంగా ఉంటుంది.
గమనిక : వృశ్చిక రాశి లో జన్మించిన వారికి సాధారణంగా పై ఫలితాలు వర్తిస్తాయి. మీ పూర్తి భవిష్యత్ ఫలితాలు దశా అంతర్దశ ఫలితాల కొరకు. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యను వ్రాసి మీ పూర్తి పేరు జన్మ తేదీ , జన్మ సమయం, జన్మ స్థలము, వివరములతో సంప్రదించండి. మీ మెయిల్ మరియు వాట్సాప్ ద్వారా సంపూర్ణ జాతక పరిహార రిపోర్ట్ పొందండి.