loading

మీన రాశి జనన సాధారణ ఫలితాలు

  • Home
  • మీన రాశి జనన సాధారణ ఫలితాలు

మీన రాశి జనన సాధారణ ఫలితాలు

ఫిబ్రవరి 19 నుండి మార్చి 20  లోపు జన్మించిన వారిది మీన రాశి

పూర్వాభాద్ర  4 వ పాదము , ఉత్తరాబాద్ర 4 పాదాలు , రేవతి 4 పాదాలు  మీనరాశి

మీన రాశి స్వభావం రహాస్యమైనది. తమ అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. దయ గలిగినవారు.  ఉత్సాహంగా ,ప్రశాంతంగా ఉంటారు. గురువారం వికీ శుభప్రదం తెలుపు రంగు శుభ సూచకం సామాజిక సేవలు పరోపకారాల్లో  సమయాన్ని కేటాయిస్తారు. వీరికి 4,5,8 అదృష్ట సంఖ్యలు

ఈ రాశివారు జలవిభాగం, లాయర్, న్యాయవిభాగం,ఆయుర్వేద శాఖ , ఎగుమతి దిగుమతి విభాగాలు వజ్రాలు ,రత్నాలు ,శిల్పానిర్మాణం యిత్యాది రంగములో రాణిస్తారు. మరియు సంఘసంస్కర్త,విద్య విభాగంలో సలహదారుగా రాణిస్తారు.

ఈ రాశివారికి 20, 21, 22, 23, 24, 27, 31, 37, 43, 45, 54, 66  సం||లు  అదృష్టమైనవి  వీరు పసుపు వస్త్రం ,శనగలు , నెయ్యి, బంగారం, ఫలాలు , పుష్యరాగం ,తేనె , వీటిని దానము చేయటం వలన శుభములు కలిగించును. వీరు సోమవారం శివలింగమునకు ఆవుపాలు ,తేనెతో అభిషేకం చేయాలి.  వీరికి  ఇనుము చర్మపు వస్తువులను శనివారము రోజున కొనకూడదు. వీరు పసుపు ,తెలుపు రంగులు ధరించాలి.  

ఈ రాశివారు గురువార వ్రతము , విష్ణు దేవతారాధన అనుకూలము పూజా మందిరములో  గురు, విష్ణు యంత్రములకు ప్రతి నిత్యం పూజలు చేయుట వలన జీవితములో అనేక శుభములు కలిగించును.

మీనరాశి వారికి తూర్పు దక్షిణ దిశయందు గల గృహము  స్థలములు అనుకూలము వీరు నగరానికి ఆగ్నేయ భాగంలో నివసించరాదు. ఈ రాశివారు అందమైన ముఖము ,నేత్రములు కలిగి ఉంటారు. ధర్మశీలురు ,పుణ్యవంతులు , కళాకారులు, నాయకత్వ ధోరణి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో సమర్థులు. కానీ నమ్మినవారి వలన మోసగించబడతారు జాగ్రత్త వహించండి.

ఈ రాశివారికి భార్య అందమైన రూపవతి , మంచి స్వభావం, కలదై ఉంటుంది. ధార్మిక కార్యాలంటే ఇష్టం ,సిగ్గు ,బిడియం, సంతానంతో  అన్యోన్య దాంపత్య సౌఖ్యము కలుగును. మరియు సమస్త కళలలో ప్రవేశమున్నట్లు కనిపిస్తారు.

మీన రాశి జలతత్త్వాన్ని కలిగి గురు గ్రహముచేత పాలించబడుతూ ఉంటుంది. ఈ రాశివారు ఆకర్షణీయమైన శారీరక సౌష్టవాన్ని  కలిగి ఉంటారు. వీరు మంచి తేజస్సు గల నేత్రములను కలిగి జీవితములో ప్రత్యేకంగా ఏదైనా సాధించాలి  అనే లక్ష్యముతో ఉంటారు. సున్నితమైనవారు, నిజాయితీ పరులు గా ఉంటారు. వీరు ఏదైనా ఒక విషయమును గురించి ఖచ్ఛితముగా తెలుసుకున్న తరువాతనే మాట్లాడుతారు.

మీన రాశివారు దయకు మారు పేరుగా ఉంటారు. వీరు పద్య రచన ,సంగీతం, నృత్యము  మొదలైన వాటిలో ఆసక్తి కలిగి ఉల్లాసాన్ని పొందుతారు. వీరికి హాస్య పరిజ్ఞానము ఎక్కువ వీరికి ప్రయాణములనిన అధిక మక్కువ ప్రక్రుతి ఆరాధన చేస్తారు.

వీరు సాధారణ స్థాయి  విద్యార్థులుగా ఉంటారు. వీరిలో కొందరికి చదువు పట్ల అయిష్టత కుడా ఉండవచ్చు. వీరు తాము కోరుకున్నవన్నీ దాదాపుగా సాధిస్తారు.  జీవితంలో అన్ని రకాలైన సౌఖ్యాలద్వారా ఆనందాన్ని అనుభవిస్తారు. వీరు విద్య ,ఆర్థిక,జ్యోతిష, జర్నలిజం , వంటి అంశాలలో మంచి ప్రతిభను కలిగి ఉంటారు. వీరు మంచి పరిపాలకుగా కాగలరు.

వీరికి ఆహారేచ్చ స్వల్పంగా ఉండటం వలన అది కాలక్రమంలో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలకు , పేగులకు సంబంధించిన వ్యాధులకు గురౌతారు. వీరికి జలుబు,న్యుమోనియా, క్షయ వంటి వ్యాధులకు గురయ్యే అవకాశమున్నది. మానసిక ఒత్తిడి,అందోళనలు వీరి ఆరోగ్యముపై ప్రభావాన్ని అధికంగా చూపిస్తుంది. వీరు తమ ఆహార విహారాలలో నియంత్రణ , ధ్యానము ,యోగ మరియు వ్యాయామాలు చేయుట వలన  మంచి ఫలితాలు ఆరోగ్య లాభములు కలిగించును.

ఈ రాశివారు కళా హృదయులై సౌందర్యాన్ని ఆరాధించే వారై సహజంగా ఉల్లాసభరితంగా ఉంటారు. వీరి వైవాహిక జీవితం శుభ ప్రదంగా ఉంటుంది. ఈ రాశివారికి వృషభ, కర్కాటక , వృశ్చిక, మకర రాశుల వారితో వివాహ స్నేహ సంబంధాలు అనుకూలం  శుభములు కలిగించును.  

గమనిక : మీన రాశి లో జన్మించిన వారికి సాధారణంగా పై ఫలితాలు వర్తిస్తాయి.  మీ పూర్తి భవిష్యత్ ఫలితాలు దశా అంతర్దశ ఫలితాల కొరకు. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యను వ్రాసి మీ పూర్తి పేరు జన్మ తేదీ , జన్మ సమయం, జన్మ స్థలము, వివరములతో  సంప్రదించండి.  మీ మెయిల్ మరియు వాట్సాప్  ద్వారా  సంపూర్ణ జాతక పరిహార రిపోర్ట్ పొందండి