loading

తుల రాశి జనన సాధారణ ఫలితాలు

  • Home
  • తుల రాశి జనన సాధారణ ఫలితాలు

తుల రాశి జనన సాధారణ ఫలితాలు

సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 23 లోపు జన్మించిన వారిది తుల రాశి

చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు , విశాఖ 1,2,3 పాదాలు  తుల రాశి

ఈ రాశివారు పక్షపాత రహితులు , దయ గలవారు, అనుభవజ్ఞులు. వీరికి పసుపు,గులాబీ,నీలం రంగులు మంచివి బుధ,శుక్ర,శనివారాలు మంచిరోజులు వికి వజ్రం స్పటికం ధరించడం వలన శుభాలు కలిగించును, వ్యాపార ,విద్యారంగాలలో మంచి ప్రగతిని సాధిస్తారు. వీరికి పనులను వాయిదా వేసే మనస్తత్వం వలన ఇబ్బందులు కలిగించును. అందువలన వాయిదా వేసే మనస్తత్వం వీరికి శ్రేయోదాయకము కాదు జాగ్రత్త వహించండి.

ఈ రాశివారు మంచి కళాకారులు ,లాయర్, డాక్టర్ విద్యలయందు శుభ యోగము మరియు టెక్స్ టైల్స్ ,సిల్క్,పాడి పరిశ్రమ ,నెయ్యి, వెండి,వ్యవసాయం మొదలైన వాటి వృత్తుల ద్వారా లాభిస్తారు.

ఈ తుల రాశి వారికి 24  సంవత్సరాల తరువాత అదృష్టం ప్రారంభమౌతుంది. వీరికి 27, 32,36,43,44, 45,53,54,62 సంవత్సరములు శుభప్రద యోగములు కలిగించును. వీరు వజ్రం , స్పటికం , మూన్ స్టోన్  కనక పుష్యరాగం ధరిస్తే అభివృద్ధి , ఆర్థిక లాభo కలుగును. వీరికి ఉన్న మిత్రులలో కొందరు మోసం, నమ్మక ద్రోహం చేయు అవకాశమున్నది. సమయ స్పూర్తితో జాగ్రత్త ఉండటం మేలు.

ఈ రాశివారు తరచుగా  మహా లక్ష్మీ దేవి ఆలయం లేదా పూజ మందిరములో లక్ష్మీదేవి ప్రతిమ లేదా ఫోటో వద్ద ప్రతిరోజు నేతిదీపం వెలిగించి మహాలక్ష్మీ అష్టకము పారాయణం చేయుట వలన అనుకున్న పనులయందు  విజయం  శుభములు కలుగును.

ఈ రాశివారికి  దక్షిణం , పడమర దిశలో గృహ స్థలం అత్యంత అనుకూలముగా ఉంటుంది. వీరికి తెలుపు ,సిమెంట్ రంగులు కూడా అనుకూలము  ఈ రాశివారు నగరానికి వాయువ్య దిశలో నివాసం చేయకూడదు.

ఈ రాశి స్త్రీలు ధర్మవర్తనులు కష్టాలలో కూడా సంతోషంగా ఉంటారు. సమాజ సేవాభిలాషులు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు. సంస్కృతీ  సాంప్రదాయ వికాసాల పట్ల అభిరుకి ఎక్కువ ఈ రాశివారికి కఫం, వాతం , గుప్తేంద్రియ  అనారోగ్యాలతో బాధలు కలిగించును జాగ్రత్త పడండి.

ఈ రాశి స్త్రీలకు అందమైన భర్త పురుషులకు ఉత్తమ ఇల్లాలు లభించును. మరియు బంధు వర్గం పట్ల ఆదరణను కలిగి జీవితం సౌఖ్యవంతముగా ఉండును.

ఈ తుల రాశికి శుక్రగ్రహము అధిపతి ఇందు జన్మించినవారు సాధారణంగా పొడవుగా క్రీడాకారులవలే దృఢత్వాన్ని కలిగి ఉంటారు  కొంతమంది 5 అడుగుల ఎత్తు వరకు  ఉండే అవకాశము ఉన్నది. వీరు అందమైన శారీరక నిర్మాణాన్ని , మృదు మందహాసమును కలిగి ఊహాత్మకత  , ఉల్లాసము , సృజనాత్మకత ,మృదు స్వభావములను కలిగి ఉంటారు. వీరు ప్రశాంత మానసిక స్థితిని కలిగి ఉండి వాదము చేయుటలో అయిష్టతను ప్రదర్శిస్తారు. విరికి స్వల్ప కోపము ఉంటుంది. వస్త్రములు, బంగారు నగలు ,సుగంధ ద్రవ్యాల పట్ల మక్కువలను కలిగి వుంటారు. వీరు ఇతరులకు ఆర్థిక, నైతిక మరియు మానసిక అంశాలలో సహకారము చేయుటకు సిద్ధంగా ఉంటారు. వీరు సాంఘిక జీవనంలో చురుకుగా పాల్గొంటారు. వీరు చక్కని ఆతిధ్యాన్ని  కలిగిస్తారు. గృహములో సుఖ సౌఖ్యములను పొందుతారు.

ఈ రాశివారు మానసిక శాస్త్రము ,న్యాయ శాస్త్రము, గణిత శాస్త్రము , సంబంధిత విద్య అంశాలలో మరియు మార్కెటింగ్ వ్యాపారములో అభివృద్ధి చక్కని స్థితిని ఆసక్తిని  కలిగి ఉంటారు.

వీరు చక్కని ప్రజా సంబంధాలను కలిగి రాయబారులుగా ,రాజ నీతిజ్ఞులుగా ,లాయర్లు జడ్జీలుగా ,రాజకీయవేత్తలుగా ,ప్రజా సంబంధం గల ఆఫీసర్లుగా , జర్నలిస్టుగా సేల్స్ మాన్ గా మంచి ప్రతిభా విశేషాల్ని కలిగి ఉంటారు.

వీరు కొనుగోలు విషయాల్లోనూ , రిస్క్ తీసుకుని చేసే పెట్టుబడుల విషయంలోనూ బహు జాగ్రత్తగా వ్యవహరించాలి. వీరు భాగస్వామ్య వ్యాపార విషయాల్లో అధిక శ్రద్ధను కలిగి ఉండాలి.

ఈ రాశివారికి చక్కని శారీరక నిర్మాణాన్ని కలిగి ఉంటారు. వీరికి సాధారణంగా కిడ్నీలు ,జననావయ సంబంధ  అంశాలలో అనారోగ్యానికి గురౌతుంటారు. వీరు స్వంత వైద్యము చేసుకోవటమనేది అనేక చిక్కులను దారితీస్తుంది.

వీరు నిత్య శాశ్వత సంబందాల పట్ల అధిక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీరు ప్రేమలో ఇతరుల్ని ఆకర్షించటంలో  నైపుణ్యము కలిగి ఉంటారు. వీరికి త్వరగా వివాహ యోగము కలుగును. వీరు సర్దుబాటు ధోరణి , సంతోషము , తెలివితేటలను కలిగి ఉంటారు. ఈ తుల రాశివారికి మిథున కుంభ రాశులవారితో సంబంధ బాంధవ్యాలు సౌఖ్యప్రదంగా ఉంటాయి.

గమనిక : తుల రాశి లో జన్మించిన వారికి సాధారణంగా పై ఫలితాలు వర్తిస్తాయి.  మీ పూర్తి భవిష్యత్ ఫలితాలు దశా అంతర్దశ ఫలితాల కొరకు. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యను వ్రాసి మీ పూర్తి పేరు జన్మ తేదీ , జన్మ సమయం, జన్మ స్థలము, వివరములతో  సంప్రదించండి.  మీ మెయిల్ మరియు వాట్సాప్  ద్వారా  సంపూర్ణ జాతక పరిహార రిపోర్ట్ పొందండి.