loading

సింహరాశి లో జన్మించిన వారి భవిష్యత్ రాశి ఫలితాలు

  • Home
  • సింహరాశి లో జన్మించిన వారి భవిష్యత్ రాశి ఫలితాలు

సింహరాశి లో జన్మించిన వారి భవిష్యత్ రాశి ఫలితాలు

జులై 24 నుండి ఆగష్ట్ 23 వరకు జన్మించిన వారు సింహ రాశి జాతకులు

మఖ 4 పాదాలు , పూర్వఫల్గుణి 4 పాదాలు , ఉత్తర 1 వ పాదము  సింహ రాశి 

సింహ రాశిలో జన్మించినవారు కార్య శీలురు స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. వీరు పరిశుభ్రత అధికంగా పాటిస్తారు. గొప్ప ఆశయాలను కలిగి ఉంటారు. దీర్ఘాలోచన, కోపం, అనాలోచిత ప్రతిస్పందన వీరి లక్షణాలు వీరు న్యాయాధికారిగా ,లాయర్ గా , సంగీత ,వేద, జ్యోతిష్య ,సాంకేతిక విద్య వృత్తులలో రాణిస్తారు. క్షమా గుణం అధికం హృదయ , నేత్ర ,మానసిక శిరస్సు, నరాలకు సంబంధించిన బాధలను కలిగి ఉంటారు. బాధ్యత గల కార్యాలను శ్రద్ధగా నిర్వర్తిస్తారు. వీరికి వృషభ, కర్కాటక, వృశ్చిక, ధనస్సు, మీన రాశులకు చెందిన స్త్రీలతో వివాహం శుభప్రదము, స్త్రీలకు మేష ,వృషభ, సింహ, తుల,ధనస్సు, కుంభ రాశి పురుషులతో వివాహం ఉత్తమంగా ఉంటుంది.

వీరు వస్త్ర వ్యాపారులు, డాక్టర్లు ,పరీక్షాధికారులు , జైలర్లు , ఔషధ వ్యాపారము , పౌరోహిత్యము వ్యవసాయము ఇత్యాది రంగములో రాణిస్తారు. వీరికి 10,14,19,23,37,41,46,50,55,59,64 సం||లు అదృష్ట ప్రదమైనది.

ఈ రాశివారు మాణిక్యం రత్నము ధరించాలి మారేడు చెట్టు వేరును తావిజులో ధరించడం వలన శుభములు కలిగించును.

ఈ రాశివారికి ఉన్నత శ్రేణి గల వ్యక్తులతో పరిచయాలు అనేక విషయముల యందు అవగాహన వలన అనుకున్న పనులు విజయం కలుగును. వ్యవసాయం లాభకరముగా ఉండును. వీరు ఆదివార వ్రతాన్ని ఆచరించాలి సూర్య గాయత్రీ యంత్రాలు వీరికి అనుకూలిస్తాయి.  వీరికి ఉత్తర తూర్పు దిశలు అనుకూలంగా ఉంటాయి. నగరం మధ్యలో నివాసం ఉండరాదు. వీరు అందమైన శరీర సౌష్టవం కలిగి ఉంటారు. మంచి మేధావులు న్యాయ పరంగా ప్రవర్తిస్తారు. సంతాన ,కుటుంబ విషయాలలో ముందు చూపుతో ప్రవర్తిస్తారు.

ఈ రాశివారికి భార్య రూపవతి, అందము గలది , స్త్రీ సంఘ అధ్యక్షురాలై ఉండును. క్రూర కర్మలు చేయుట యందు  మరియు మాంసాహార ప్రీతి గలదియై  ఉండును.

ఈ సింహారాశి అగ్ని తత్వాన్ని కలిగి సూర్యునిచే పరి పాలింప బడుతూ ఉంటుంది. వీరు నాయకులుగా అధికార్లుగా వ్యవహరిస్తారు. విశాలమైన శారీరక నిర్మాణము కళ్ళలో తీక్షణత కలిగి ఉంటారు. వీరు మంచి పొడుగైన శరీరమును అనగా సుమారు 5.8 నుడి 6 అడుగుల ఎత్తువరకు ఉంటారు. వీరు స్నేహితులుగా ఉంటూనే తమకంటూ ఒక ప్రత్యేకతను కలిగి తమకు తామే ఇతరుల కంటే అధికులుగా భావిస్తూ ఉంటారు. వీరు ఉత్సాహంతో స్వయం ప్రేరితులై ఆకర్షణీయమైన తత్వాన్నిమరియు ఆశావాహ ధృక్పధం  కలిగి ఉంటారు.

ఈ రాశి వారు వైభవోపేతమైన వస్త్రధారణ చేస్తారు. వీరు ఏదైనా ఒక పని విషయంలో కృషి చేయడంలో సమర్థతగా ఉంటారు. వీరు ఎవరైనా తమపట్ల స్వల్ప అలసత్వాన్ని ప్రదర్శించినా తట్టు కోలేకపోతారు. ఈ రాశి విద్యార్థులు సామాన్య శ్రేణికి చెందిన వారుగా ఉంటారు.  మామూలు విద్యాలకన్నా వృత్తి సంబంధమైన విద్యల పట్ల అధికమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీరు చారిత్రక సంబంధ సబ్జెక్ట్ పట్ల అధికమైన ఆసక్తిని స్కూలు మరియు కాలేజీ స్థాయిలు రెండింటి లోనూ ఉన్నత స్థితి కలిగి ఉంటారు.

ఈ రాశి వారు జీవితంలో ఎప్పుడు ఒకే రకంగా ఉండటానికి ఇష్టపడరు. వీరు తమకు ఉన్న పరిమితి వనరులతోనే అపరిమిత సౌఖ్యలను పొందుటకు ప్రయత్నింస్తుంటారు.  ఈ రాశివారిలో కొంతమంది జన్మతః ధనవంతులు గా ఉంటారు.  లేదా 30 సంవత్సరముల తరువాత ఆర్థిక స్థిరత్వము అభివృద్ధి కలిగి ఉంటారు. తమ తొందరపాటు చర్యల వలన , అనాలోచిత నిర్ణయాల వలన అధికంగా నష్ట పోతుంటారు.

ఈ రాశివారు ప్రజా సంబంధిత అంశాలలో పెట్టుబడులు పెట్టినచో లాభదాయకము ఎగుమతి, దిగుమతులు వీరికి సత్ఫలితాలను ఇస్తాయి. వీరికంటే పెద్ద వారైన వారి వలన లాభాలు కలిగించును స్పెక్యులేషన్ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వీరికి వజ్రాలు ,బంగారపు గనులు మరియు ఇత్తడి లోహపు సంబంధపు పనులు ఫలవంతముగా ఉంటాయి. మరియు ప్రభుత్వ లేదా మున్సిపాలిటీ సంబంధమైన వ్యవహారాలు వీరికి లాభదాయకములు

ఈ రాశివారు శారీరకముగా మంచి బలము ,దృఢత్వములను కలిగి ఉంటారు. సహజంగా వీరిది చక్కని ఆరోగ్యస్థితి వీరు ఏదైనా అనారోగ్యానికి గురైతే దాని నుంచి కొలుకోవటానికి ఇతరుల కంటే చాలా సమయం పడుతుంది. వీరికి కండరాలు, హృదయము ,ఉదరములు ,జీర్ణవ్యవస్థ యిత్యాది అనారోగ్య సమస్యలు మరియు వాహన ప్రమాదాలు కలిగించును.

ఈ సింహ రాశివారు ఉన్నతమైన ప్రేమ స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చక్కని శారీరక ఆకర్షణను కలిగి ఇతరుల చేత ( స్త్రీలు పురుషుల చేత ,పురుషులు స్త్రీల చేత ) త్వరగా ఆకర్శింపబడతారు. వీరు ఉత్తేజ పూరిత ప్రేమ స్వభావాన్ని కలిగి ఉంటారు. తాము ప్రేమించినవారిని ఎల్లప్పుడు సంతోషముగా ఉండేట్లు చూసుకుంటారు. వీరికి ఇల్లు మరియు సంతానము పట్ల అధిక శ్రద్దా సక్తులు ఉంటాయి. వీరు మేష మరియు ధనస్సు వారితో సత్సంబం ధాలను కలిగి ఉంటారు.

గమనిక : సింహ రాశి లో జన్మించిన వారికి సాధారణంగా పై ఫలితాలు వర్తిస్తాయి.  మీ పూర్తి భవిష్యత్ ఫలితాలు దశా అంతర్దశ ఫలితాల కొరకు. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యను వ్రాసి మీ పూర్తి పేరు జన్మ తేదీ , జన్మ సమయం, జన్మ స్థలము, వివరములతో  సంప్రదించండి.  మీ మెయిల్ మరియు వాట్సాప్  ద్వారా  సంపూర్ణ జాతక పరిహార రిపోర్ట్ పొందండి.