loading

కర్కాటక రాశి లో జన్మించిన వారి భవిష్యత్ రాశి ఫలితాలు

  • Home
  • కర్కాటక రాశి లో జన్మించిన వారి భవిష్యత్ రాశి ఫలితాలు

కర్కాటక రాశి లో జన్మించిన వారి భవిష్యత్ రాశి ఫలితాలు

జూన్ 22 నుండి జులై వరకు జన్మించిన వారు కర్కాటక రాశి జాతకులు

పునర్వసు 4 వ పాదము , పుష్యమి 4 పాదాలు , ఆశ్లేష 4 పాదాలు  కర్కాటక రాశి

కర్కాటక రాశిలో జన్మించినవారు  బుద్ధి శీలత  నమ్రత, భోగలాలసత్వాన్ని కల్కి ఉంటారు. పలురకాల పదవులను చేపట్టేవారు, శాంతి కాములు, ధార్మికులు, స్త్రీలు అభిమానిచే వారుగా ఉంటారు. వీరు జల సంబంధ క్రియలు ,వ్యాపారం చేస్తారు వీరికి మిత్రుల సహకారం ఉంటుంది. అనేక కష్టాల అనంతరం గాని అద్రుష్టం సహకరించదు. ఈ రాశివారికి పసుపు, నేరేడుపండు రంగు,, నీలం రంగు మంచివి లక్కీ నెంబర్ ౩

ఈ రాశివారు సంగీతం, సినిమా చిత్రకళా రంగాలలో మరియు  బియ్యం పత్తి, తెల్లని వస్తువుల వ్యాపారం అనుకూలిస్తాయి అనేక విధాల లాభాలను పొందుతారు.

ఈ కర్కాటక రాశివారికి  11,13,,20,29,31,,38,47,49 సం||ల వయస్సులో అద్రుష్ట ప్రదమైనది.  ఈ రాశివారు భాగ్యాభి వృద్ధికి  శుక్రవారం రోజున తెల్లని వస్త్రాలు తప్పకుండా ధరించాలి . ప్రతి నిత్యము  శివారాధన చేయుట వలన  సుఖ సంతోషాలు కలుగును. వీరు ముత్యం, కనక పుష్యరాగం రత్నములు ధరిస్తే ఆర్థిక ప్రగతి కలుగును.

ఈ రాశివారికి మిత్రుల ఈర్ష్యా ద్వేషాలకు గురి అవుతారు. మోసపు స్నేహితుల పట్ల జాగ్రత్త వహించటం మంచిది. విరకి మేష, సింహ, కన్య,తుల,మకర రాశులకు చెందిన మిత్రులు మాత్రమే సహకరిస్తారు. వారంతా ఈ రాశివారికి లాభాలను  కలిగిస్తారు.          

ఈ రాశివారికి ఉత్తర దక్షిణ దిశలు గలిగిన గృహ స్థలాలు  లాభదాయక మైనవి.  వీరు పట్టణం యొక్క నైరుతి భాగంలో నివసించ రాదు. ఈ రాశివారు అందమైన ముఖం ,కళ్ళు మధుర స్వరం కలిగిన వారు గౌరవం  చూపిస్తారు. , గర్వం ,మొండితనం, కోపం  ఈ 3 ఉంటాయి. వీరిలో ఆధ్యాత్మిక భావన ఉంటుంది. వీరికి హృదయ, నేత్ర, ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఉంటాయి  

ఈ రాశి స్త్రీలు  తెలివైన గృహిణులు గా ప్రవర్తిస్తారు. స్నేహం ,మానవత, ఆప్తులలో ముఖ్యమైన వారుగా , దేవ బ్రాహ్మణ భక్తిని కలిగి ఉంటారు.

ఈ కర్కాటక రాశి జలతత్త్వాన్ని కలిగి చంద్రునిచే పరి పాలింపబడుతుంది. ఈ రాశిలో జన్మించినవారు  విశాలమైన ఊర్థ్వ శరీరము విశాలమైన ముఖము, గోధుమ వర్ణపు శిరోజాలు , చిన్నవైన ప్రత్యేకతను కలిగి ఉన్న నేత్రములను కలిగి ఉంటారు. సాధారణంగా వీరు ఆకర్షణీయమైన శారీరక సౌష్టవాన్ని కలిగి ఉంటారు. వీరు దయ ధైర్యము  సహాయము చేసే గుణము ,సున్నితత్వము ఆలోచనాత్మక ధోరణి కలిగి ఉంటారు.

వీరు నిజాయితీ , విశ్వాస నీయత , అంకిత భావము , భాద్యత అనే గుణాలతో శోభిస్తారు. స్వల్ప ఉద్రేకం కలిగి ఉంటుంది .   వీరు సాధారణంగా గృహంలో ఉండేవారిగా ఉంటారు. వీరి తల్లితో అధికమైన చనువుగా ఉంటారు. వీరు ఇతరుల సమస్యలను శ్రద్ధగా విని వారికి తగిన రీతిలో సహాయాన్ని అందిస్తారు. వీరు ధనవ్యయం పట్ల అధికమైన శ్రద్ధ వహించాలి

ఈ రాశివారు ప్రతిభావంతులై తమకు నచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. వీరు రహస్యాలను జాగ్రత్తగా కాపాడతారు. వీరు మేధా వంతులు. చరిత్ర మరియు వైద్యశాస్త్రము వీరికి అభిమానదాయక విద్యాంశాలు వీరు విద్యలో చాలా నిదానంగానే పురోగతిని సాధిస్తారు. వీరు ఆధృష్టవశాత్తు మంచి ఆర్థిక హోదాను కలిగి ఉంటారు. కానీ వీరు అధికమొత్తం  ధనం ఆశించి కంపెనీలలో పెట్టుబడులు పెట్టి నష్టపోయే అవకాశం ఉంటుంది. అగ్రిమెంట్ ఒప్పందాలపై సంతకాలు చేయడంలో ఒకటికి పదిసార్లు చదివి చూసిన తరువాతనే ఒప్పందం కుదుర్చుకోండి వీరికి నూనె ,ఓడలు, మందులు మొదలైన అంశాలలో పెట్టుబడులు లాభదాయకంగా ఉంటుంది. వీరు సంగీత సాహిత్యముల ద్వారా ఆర్థిక వృద్ధిని పొందుతారు.

ఈ రాశివారు స్వంత వ్యాపారం , వ్యాఖ్యాతలుగా, బోధకులుగా ,టీచింగ్ , నటన ,జ్యోతిష్యం మరియు క్రయ విక్రయాలు మొదలైన రంగాలలో రాణిస్తారు. వీర శక్తివంతంగా ప్రభావితంచేసే వారుగా ఉంటారు. కళాత్మక రాజకీయ రంగములో మంచి ప్రతిభను చూపిస్తారు. వీరు ప్రజలతో ముఖ్యంగా చిన్నపిల్లలు , వృద్ధులతో సత్సంబంధాన్ని కలిగి ఉంటారు. నర్సులు లేదా సర్జన్ లుగా రాణిస్తారు. వీరు అనుకొన్నవి తరచుగా మారిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ గుణాలను నీయంత్రించుకో కలిగితే మంచి విజయావకాశాలు లభించును.

ఈ రాశివారికి ఊపిరితిత్తులు, గొంతు, ఆస్మా , దగ్గు ,జలుబు,బలహీనమైన జీర్ణ వ్యవస్థ , నరముల బలహీనత , నిద్రలేమి,కీళ్ల నొప్పులు వంటి అనారోగ్యాలకు గురయ్యేందుకు అవకాశమున్నది. వీరు నడక,యోగ వంటివి అభ్యసించినచో శారీరక మానసిక ఆరోగ్యాలు చేకూరుతాయి.

ఈ రాశివారు చాలా ప్రభావితం చేసేవారుగా ఉంటారు. విరకి స్నేహితులు శత్రువులు అధికంగానే ఉంటారు. వీరు సున్నితమైన తరచూ మారిపోయే మానసిక స్థితి వీరికి ప్రేమలో పలు ఆటంకాలని కలిగిస్తుంది. సాధారణంగా ఉద్రేక స్వభావం వలన వైవాహిక జీవితంలో వీరికి సమస్యలేదురవుతుంటాయి. వీరు స్వల్ప శ్రద్ద కలిగి ఉంటే సహనాన్ని పాటిస్తే వైవాహిక జీవితం సుఖ సౌఖ్యఅలతో ఉంటుంది. సంతాన రీత్యా వీరు ఆధృష్ట వంతులు వీరు వృశ్చిక ,మీన రాశుల వారితో సంబంధ బాంధవ్యాలను కలిగి ఉన్న శ్రేష్టము

గమనిక : కర్కాటక రాశి లో జన్మించిన వారికి సాధారణంగా పై ఫలితాలు వర్తిస్తాయి.  మీ పూర్తి భవిష్యత్ ఫలితాలు దశా అంతర్దశ ఫలితాల కొరకు. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యను వ్రాసి మీ పూర్తి పేరు జన్మ తేదీ , జన్మ సమయం, జన్మ స్థలము, వివరములతో  సంప్రదించండి.  మీ మెయిల్ మరియు వాట్సాప్  ద్వారా  సంపూర్ణ జాతక పరిహార రిపోర్ట్ పొందండి.