loading

కుంభరాశి జనన సాధారణ ఫలితాలు

  • Home
  • కుంభరాశి జనన సాధారణ ఫలితాలు

కుంభరాశి జనన సాధారణ ఫలితాలు

జనవరి 21 నుండి ఫిబ్రవరి 19  లోపు జన్మించిన వారిది కుంభ రాశి

ధనిష్ట 3, 4 పాదాలు , శతభిషం  4 పాదాలు ,పూర్వాభాద్ర 1,2,3 పాదాలు  కుంభ రాశి   

కుంభ రాశి జాతకులు కలుపుగోలుగా వుంటారు. వీరి మనసులో మాట గ్రహించటం కష్టం. వీరు ఆత్మ విశ్వాసం కలవారు . సహృదయులు ,వీరు భావకులు , సంవేదనా పరులు .

మకర రాశివారు కాంట్రాక్ట్ లు , రహదారులు,,భవన నిర్మాణ సామగ్రి ,చర్మం ,ప్లాష్టిక్, వస్త్ర, వ్యవసాయం, పల్లవ్యాపారం , ట్రావెలింగ్ ఏజన్సీ , ఇనుము,నునే ,బొగ్గు, పెట్రోలియం మొదలగు వ్యాపార వ్యవహారములలో రాణిస్తారు.

ఈ రాశివారికి  23,24,30,32,40,,41,42,44,50,51,53,60,61,62  సం||లు ఆధృష్ట ప్రదమైనవి వీరు నీలం  రత్నమును ధరించాలి శనివార వ్రతమును మరియు శని యంత్రమునకు  పూజ , శివారాధన చేయుట వలన శుభములు కలిగించును.

ఈ రాశివారికి పడమర ఉత్తర దిశల యందు  గృహ ,స్థలములు అనుకూలము  వీరు నీలం ,గులాబీ, సిమెంట్ రంగుల వస్త్రాలు ధరించడం మంచిది. నగరం యొక్క ఈశాన్య భాగంలో నివసించరాదు గమనించండి.

ఈ రాశివారు గౌర వర్ణం కలిగి దేహాపుష్టిని కలిగి వుంటారు. వీరు  భాగ్యవంతులుగా వుంటారు. గర్విష్టులైన కర్తవ్య పరాయణులు . స్త్రీ సంతానం పట్ల మక్కువ అధికం వీరికి బ్రెయిన్ హెమరేజ్ , పక్షవాతం , ఉదర , జననేంద్రియ వ్యాధులు ఎక్కువగా వుంటాయి

ఈ రాశివారి  భార్య రూపవతి అందమైన శరీరాన్ని కలిగి, దాన శీలురాలు, భాగ్యవతి, సంతానవతి అభిమానవంతురాలై  వుంటుంది.

ఈ రాశి వాయు స్వభావాన్ని కలిగి శని చేత పరిపాలింపబడుతూ ఉంటుంది. ఈ రాశీయందు. జన్మించిన వారు సాధారణంగా పొడవుగా  గుండ్రని ముఖమును కలిగి వుంటారు. వీరు అందమైన శారీరక నిర్మాణమును కలిగి వుండి దాయార్ద్ర హృదయులై ,శక్తిమంతంగా ,పద్ధతి ప్రకారం వ్యవహరిస్తారు. మర్యాద స్థితిని కలిగి ఉంటారు. వీరికి స్నేహ సంబంధాలనేవి ప్రముఖులైన వారితో ఉంటాయి  చాలా పేరు ప్రతిష్టలు పొందుతారు. అయినప్పటికి  వీరు ఏకాంతాన్నే కోరుకుంటారు.

వీరికి వ్యక్తి గత స్వాతంత్ర్యము , స్వేచ్ఛ అనేవి చాలా ముఖ్యమైనవి. వీరు నైతిక విలువలను కలిగి ఉండి జీవితము పట్ల విశాల హృదయ దృక్పథంతో ఉంటారు. వీరు ప్రకృతి సౌందర్యాన్ని ప్రేమిస్తారు. మృదువైన ,మెత్తనైనా సంగీతం పట్ల వీరికి మక్కువ ఎక్కువ .

వీరికి సృజనాత్మక ఆలోచనలు ఎల్లప్పుడు అధికంగానే ఉంటాయి వీరు సంస్కరణలు, మార్పులు ,మానవ స్థితి గతులలో మార్పులు మొదలగు వాటిపట్ల  అనుకూల వైఖరిని కలిగి ఉంటారు.

వీరు విద్య విషయంలో మంచి స్థితిలోనే ఉంటారు. ఉన్నత శ్రేణిలో విద్యాభ్యాసం చేస్తారు. అధిక సమయం గ్రంథాలయాలలో లేదా ఉపాధ్యాయులు మరియు ప్రొఫెసర్లతో  గడుపుతూ విజ్ఞాన సేకరణ చేస్తారు.  వీరికి జ్యోతిష్య గణితం, తత్త్వ శాస్త్రం, భౌతిక శాస్త్రాలలో  మంచి ప్రతిభ ఉంటుంది. మరియు వేదాభ్యాసము ,పౌరోహిత్యము , సాంకేతిక విద్యలలో ప్రవేశం ఉంటుంది.

ఈ రాశి వారు స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ వ్యాపారాల పట్ల చాల హెచ్చరికగా ఉండవలెను. వీరు బ్యాంక్ డిపాజిట్లపై  వచ్చే వడ్డీలు ,ఇంటి అద్దెల ద్వారా అధికమైన ఆదాయాన్ని పొందుతారు. వీరు మార్కెటింగ్  వ్యాపారము ,మందులు, వ్యవసాయ రంగములో ప్రావీణ్యత కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది   వైద్యులుగా ,మంచి సర్జన్ గా పేరు సంపాదిస్తారు. లేదా ఇంజనీర్లు గా కూడా రాణిస్తారు.

ఈ రాశివారికి సృజనాత్మకత మరియు స్వతంత్ర భావాలు అధికము వీరు సంగీతము ,చిత్రలేఖనము  , నటన మరియు రచనలు చేయుట , ఉపాధ్యాయులు ,ఆర్కిటెక్ట్ గా నగర ప్రణాళికా అధికారిగా , గొప్ప పరిశోధకులుగా ఉండటం జరుగుతుంది.

వీరి ఆరోగ్య స్థితి బాగున్నప్పటికి అది వీరికి ఒక సమస్యాత్మకంగా గోచరిస్తుంది. వీరు సరి  అయిన కారణం లేకుండా వైద్య సలహా లేకుండా మందులను కొనుగోలు చేస్తారు. వీరికి మధుమేహము, శారీరక నొప్పులు నరాలకు సంబంధించిన సమస్యలకు గురయ్యే ప్రమాదము ఉన్నది. జాగ్రత్తవహించాలి.

వీరి అందమైన రూపము సంస్కార పూర్వక ప్రవర్తన పట్ల ఇతరులు ఆకర్షితులై  స్నేహం చేస్తారు. వీరు తమయొక్క  నిరాశ నిస్పృహల మనస్తత్వాన్ని వదిలివేసి కుటుంబముపై తగిన శ్రద్ధను కనబరచిన చో  వీరి వైవాహిక జీవితము సుఖ సౌఖ్యాలతో ఆనంద ప్రదంగా ఉంటుంది. 

గమనిక : కుంభ రాశి లో జన్మించిన వారికి సాధారణంగా పై ఫలితాలు వర్తిస్తాయి.  మీ పూర్తి భవిష్యత్ ఫలితాలు దశా అంతర్దశ ఫలితాల కొరకు. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యను వ్రాసి మీ పూర్తి పేరు జన్మ తేదీ , జన్మ సమయం, జన్మ స్థలము, వివరములతో  సంప్రదించండి.  మీ మెయిల్ మరియు వాట్సాప్  ద్వారా  సంపూర్ణ జాతక పరిహార రిపోర్ట్ పొందండి.