loading

మకర రాశి జనన సాధారణ ఫలితాలు

  • Home
  • మకర రాశి జనన సాధారణ ఫలితాలు

మకర రాశి జనన సాధారణ ఫలితాలు

డిసెంబర్ 22  నుండి జనవరి 21 లోపు జన్మించిన వారిది మకర రాశి

ఉత్తరాషాడ 2,3,4 పాదాలు , శ్రవణం 4 పాదాలు ధనిష్ట 1,2 పాదాలు మకర రాశి

ఈ రాశివారు ధృఢ నిశ్చయం కలిగినవారు . త్వరగా నిర్ణయం తీసుకుంటారు. బుద్ధిమంతులు , దూర దృష్టి కలవారు, ఆలోచనాపరులు ,ఆధ్యాత్మిక రంగములో ఆసక్తి కల్గి ఉంటారు. శుక్ర, శనివారములు  వీరికి మంచిది. 5,6,8 వీరి లక్కీ నెంబర్లు నీలం ,వంకాయ నలుపు, పచ్చ రంగుల వస్త్రాలు  వీరు ధరించడం వలన శుభములు కలిగించును, వీరు వినోద ప్రియులు. తక్కువ సమయంలో ఎక్కువ పనిని చేయగలరు.

ఈ రాశివారు ఖనిజ వ్యాపారము , ఇనుము, ఇటుక, మైనపు వత్తులు వ్యాపారం మొదలగు వాటిల్లో రాణిస్తారు. వీరికి వైద్య సంబంధ వృత్తి అనుకూలంగా ఉంటుంది.

ఈ మకర రాశివారికి 17,19,26,28,35,44,46,53,55 సం||లు అదృష్ట ప్రదమైనది వీరు తరచుగా రుద్రాభిషేకం ,బిల్వ పత్రములతో శివ లింగార్చన చేయుట వలన అదృష్టము శుభ లాభములు కలిగించును. వీరు శనివారము నువ్వుల నూనె ,నల్ల నువ్వులు, ఇనుము, నల్ల వస్త్రము , పాదరక్షలు, గొడుగు ,కస్తూరి , స్వర్ణమును దానము చేయాలి శనివారము రోజున  మరియు ముఖ్యముగా శని త్రయోదశి రోజున  శనీశ్వర భగవానుడికి  తైలాభిషేకము జరిపించాలి ,  గృహములో పూజా మందిరము శివ యంత్రమును స్థాపించి  ప్రతి నిత్యము పూజ చేయుట వలన అనేక శుభములు కలుగును.

వీరికి బ్యాంకులు ,స్నేహ వర్గము నుండి  ఆర్థిక సహాయము లభిస్తుంది.  మకర రాశివారికి ఉత్తర ,దక్షిణ దిశలు కలిగిన గృహములు ,స్థలాలు అత్యంత అనుకూలముగా ఉండును. నగరం మధ్యలో నివాసం ఉండకూడదు. ఇబ్బందులు కలిగించును.

మకర రాశి  స్త్రీలు  మనోహరంగా కన్పిస్తారు. ధృఢమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి ఉదర ,అజీర్ణ వ్యాధులు ,ట్యూమర్స్  కలిగే అవకాశం ఉన్నది. వీరి స్వభావం కోమలమైనది. వీరు ధార్మికులు  శీలవతులు సంతాన సుఖాన్ని సమృద్ధిగా పొందుతారు.

మకర రాశివారికి  భార్యలు అందంగా వుంటారు. సత్యప్రియులు , గంభీరంగా ఉంటారు. విద్యావంతులు ,నీతిమంతులు, సరళ స్వభావం కలిగి ఉంటారు. శత్రువులను జయిస్తారు. భార్య మూలకంగా చాలా ఆనంద సుఖ సౌఖ్యలను పొందుతారు.

మకర రాశి శని గ్రహముచేత పరిపాలన చేయ బడుతున్నది. ఈ రాశిలో జన్మించినవారు. పొడవుగా చక్కని నాసిక (ముక్కు) ,దట్టమైన శిరోజాలను కలిగి ఉంటారు. వీరు చేయు పనులయందు విజయము సాధించ వలేను అనే లక్ష్యమును కలిగి ఉంటారు. నిజాయితీ పరులుగా ఉంటారు. వీరికి సంఘములో గౌరవ మర్యాదలను పొందుతారు. వీరు తం స్వయంకృషి మరియు అంకిత భావములతో తమ విధులను నిర్వర్తించి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి స్త్రీలు తమ భర్తకు చక్కని సహకారాన్ని అందించి. అతడు సంఘంలోను, ఆర్థికంగా బలోపేతుడయ్యేందుకు  దోహదకారులవుతారు. వీరికి హాస్య పరిజ్ఞానము అధికము. వీరు స్నేహపూర్వక , నిజాయితీ, విశ్వసనీయత అనే గుణాలను కలిగి వుంటారు.  వీరు స్వయంకృషితో మంచి భోగభాగ్యాలు సంపాదిస్తారు. వీరు నిత్య జీవితంలో క్రమశిక్షణ. విధేయత గౌరవము, త్యాగ భావములు కలిగి వుంటారు. విచారము ఏకాంతము, అభద్రతాభావాలనేవి వీరిని కృంగ దీసేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఈ రాశివారు  గణిత శాస్త్రము ,రసాయన శాస్త్రము మరియు చిత్రలేఖనము వంటి వాటిలో చక్కని ప్రతిభా విశేషములను కలిగి ఉంటారు. వీరు విద్య విషయకంగా చక్కని ఉత్తమ శ్రేణుల్ని సాధిస్తారు.

వీరు జీవితంలో ప్రధమ భాగం వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు అధికంగా ఉంటాయి. పటిష్టమైన ప్రణాళిక ,కృషి నిర్ణయాత్మక ఆచరణ వలన వీరికి అదృష్టం చేకూరుతుంది. పారిశ్రామిక సంబంధిత వ్యాపారాలు వీరికి అదృష్ట ప్రదాయకం  వీరికి భవన నిర్మాణాలు , బొగ్గు,ఇనుము, ఉక్కు, పాల పరిశ్రమ మరియు వ్యవసాయ అంశాలు లభించేవిగా ఉంటాయి. వీరు మంచి పరిపాలనా దక్షులు వీరు ఆచరణ శీలురై  విశ్వాస సహితులై ఉంటారు. వీరు దేనినైనా  స్వతంత్రంగా నిర్వహించే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు. సహజంగా  వీరు చక్కని ఆరోగ్య స్థితినే కలిగి ఉంటారు. వీరు అనుకూల దృక్పథాన్ని కలిగి ఆహార విహారాలలో నియమ నిబంధనలు  పాటించిన శ్రేయోదాయకము. వీరికి శరీర సంబంధ నొప్పులు వాపులు  కలుగుతూ ఉంటాయి.

వీరికి చర్మ సంబంధ వ్యాధులు అలేర్జి , చర్మము గీరుకు పోవుట  వంటి  అనారోగ్యాలు కలుగుతుంటాయి. వీరు ఉదర శ్వాస కోశ సంబంధ సమస్యలకు గురవుతారు. వీరు తరచుగా వారి రక్తపోటు , మధుమేహ వ్యాధులను పరీక్షించు కోవటం మంచిది.

ఈ రాశి వారికి వృషభ ,కన్య రాశుల వారితో సంబంధ బాంధవ్యాలు శుభప్రదము వీరు తమ కుటుంబ, ఆరోగ్య విషయాలకు ప్రాదాన్యతనిచ్చి  అనంద  ప్రదమైన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తారు.

గమనిక : మకర రాశి లో జన్మించిన వారికి సాధారణంగా పై ఫలితాలు వర్తిస్తాయి.  మీ పూర్తి భవిష్యత్ ఫలితాలు దశా అంతర్దశ ఫలితాల కొరకు. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యను వ్రాసి మీ పూర్తి పేరు జన్మ తేదీ , జన్మ సమయం, జన్మ స్థలము, వివరములతో  సంప్రదించండి.  మీ మెయిల్ మరియు వాట్సాప్  ద్వారా  సంపూర్ణ జాతక పరిహార రిపోర్ట్ పొందండి.