loading

ధనస్సు రాశి జనన సాధారణ ఫలితాలు

  • Home
  • ధనస్సు రాశి జనన సాధారణ ఫలితాలు

ధనస్సు రాశి జనన సాధారణ ఫలితాలు

 నవంబర్  24 నుండి డిసెంబర్ 23 లోపు జన్మించిన వారిది ధనస్సు రాశి

మూల 4 పాదాలు , పూర్వాషాడ 4 పాదాలు , ఉత్తరాషాడ 1 వ పాదము  ధనస్సు రాశి

ధనస్సు రాశివారు  ముఖ్యమైన పనులను సమర్థవంతముగా పూర్తి చేస్తారు. వీరు ముందు చూపు గలవారు. కోప స్వభావము కలవారగుటచే  కొందరు వీరికి దూరంగా ఉంటారు. వీరికి వ్యాపారముల్లో లాభాలు వస్తాయి. ఈ ధనస్సు రాశివారికి అది,సోమ,గురువారములు మంచివి వీరికి 1,2,4,7,9 సంఖ్యలు శుభప్రదంగా ఉంటాయి.

వీరు స్కూలు ,ధార్మిక సంస్థలు, భోజన ,వస్త్ర ,బ్యాంకులు, పౌరోహిత్యం, పబ్లిషర్ ,బ్రిక్స్ (ఇటుకల వ్యాపారం ),ఇన్ కం ట్యాక్స్,  సేల్స్ టాక్స్  వంటి రంగాలలో రాణిస్తారు.

ఈ రాశివారికి 19,25,28,34,43,46,52,55,61,64 సం||లు అదృష్ట ప్రదమైనది  వీరు గురువార వ్రతము మరియు గురు దత్తాత్రేయ స్తోత్రము, విష్ణు సహస్ర నామ పారాయణం  మరియు సోమవారము శివార్చన చేయాలి. వీరు పసుపు ,వస్త్రం, శనగలు, నెయ్యి ,బంగారం, పండ్లు , తేనె, విద్యార్థులకు పుస్తకాలు మొదలైన వాటిని దానము చేయుట వలన శుభాలు కలిగించును. వీరు కనక పుష్యరాగం రత్నం కుడిచేతి మధ్య వేలుకి ధరించాలి.

వీరికి భాగస్వాముల వలన మోసపోయే ప్రమాదము ఉన్నది సమయ స్ఫూర్తితో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులు సహకారము ఉంటుంది కానీ బంధువర్గము మిమ్మల్ని నమ్మించి మోసం చేయవచ్చు.  జాగ్రత్త పడండి.

ఈ ధనస్సు రాశి వారికీ తూర్పు ,పడమర గృహ ,స్థలాలు  అనుకూలము లాభాలను కలిగిస్తాయి . నగరానికి పడమర దిశలో నివాసం చేయరాదు.

ఈ రాశి జాతకులు గుండ్రని ముఖం తో అందమైన కళ్ళు ,జుట్టు కలిగి ఉంటారు. దైవభక్తి ఎక్కువ, ధార్మికమైన పూజలు వ్రతాలు శ్రద్ధగా చేస్తారు. దాన గుణం ఎక్కువ . మృదువు గా ,వినయంగా మాట్లాడటం ,తర్క బుద్ది ,సరళ స్వభావం కలిగినవారు. ఈ రాశి స్త్రీలు ఉత్తమ గృహిణిగా వీరు కుటుంబాన్ని కంట్రోల్ చేయగలరు. వంటలు చేయడంలో నిపుణులు. 20 సం||ల  వయస్సులో చెడు సంఘటనలు జరుగుతాయి. గర్భాశయ , యోని సంబంధ వ్యాధులకు గురవుతారు. జాగ్రత్త వహించండి. ఈ రాశి పురుషులకు భార్య ప్రేమ , వినయము, వ్రత సంపన్నురాలిగా ఉంటుంది.

ఈ ధనస్సు రాశి గురు గ్రహము ఆధీనములో పరిపాలనలో ఉన్నది. ఈ రాశిలో జన్మించినవారు చక్కని శరీర నిర్మాణాన్ని  కలిగి ,తేజోవంతమైన చూపులు, ఉత్తేజాన్ని కలిగించే కళ్ళు ,విశాలమైన నుదురు, ఆకర్షణీయమైన కళను కలిగి ఉంటారు. ఇది అగ్ని తత్త్వమును కలిగి ఉన్న రాశి . ఈ రాశివారు ధైర్యము సాహసము, అనుకూల స్వభావము, నిర్భయత  ,లక్ష్యములను కలిగి ఉంటారు. వీరు హాస్య చతురత , మేధావితనము, చురుకుదనము అవిశ్రాంత కృషి  వంటి లక్షణాలు కల్గినవారు.

ఈ రాశివారు మంచి వక్తలై వుంటారు. నిజాయితీ అనుకూల్యతా  వైఖరులతో ఇతరులను ఉత్తేజ పరుస్తారు. వీరు మంచి ఉపాధ్యాయులుగా, గురువులుగా ఉంటారు. కర్తవ్య బాధ్యతా నిర్వహణలోను కృషి చేయటంలోనూ రాజీ లేని ధోరణిని ప్రదర్శిస్తారు. వీరికి సంఘ బలం అధికంగా ఉంటుంది. వీరు అందరినీ ఉల్లాస పరుస్తూ ఉంటారు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను విశ్వసిస్తారు. వీరు విద్యలో సాధారణ స్థాయిలో ఉన్ననూ జనరల్ నాలెడ్జి , గణితము, న్యాయ ,తర్క శాస్త్రాలు ,అక్కౌంట్స్  వంటి వాటిల్లో మంచి ప్రతిభను కలిగి ఉంటారు. వీరికి స్పెక్యులేషన్ మంచిదికాదు. అవాంఛిత పెట్టుబడులకు దూరంగా ఉంటేనే శ్రేయోదాయకం , భాగస్వామ్య వ్యాపార వ్యవహారములు వీరికి అనుకూలించవు.  

ఈ ధనస్సు రాశివారు ఉపాధ్యాయులు ,ప్రజా ఉపన్యాసకులు , పురాణ ప్రవచన కారులు,  రాజకీయవేత్తలు, ఇంజనీర్లు బ్యాంక్ ఉద్యోగస్థులు, ప్రచురణ కర్తలు , సంపాదకులు, భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, స్టాక్ మార్కెటింగ్ బ్రోకర్లుగా రాణిస్తారు.

ఈ రాశివారు చాలా సున్నితమైన స్వభావం కలిగినవారు. చిన్న చిన్న ఉద్రేకం కలిగించే  పరిస్థితులు కూడా వీరి ఆరోగ్యంపై తీవ్ర వ్యతిరేక ప్రభావాన్ని కలిగిస్తాయి. వీరికి నరముల సంబంధ ,కీళ్ల సంబంధ నొప్పులతో బాధపడుతుంటారు. మరియు ఉదరము ,అజీర్ణ సంబంధ వ్యాధులు ,మధుమేహ వ్యాధులూ  కలిగే అవకాశమున్నది. వీరు ఆహార విహారాలలో శ్రద్ధ ,ధ్యానము వంటివి ఆచరించిన శుభప్రదముగా ఉండను.

ఈ రాశివారు విశాల హృదయాన్ని కలిగి ఉండి, సంఘ జీవితములో  చురుకైన పాత్రను కలిగి ఉంటారు. వీరు తమ జీవిత భాగస్వామి పట్ల మర్యాద పూర్వక ధోరణీని ప్రదర్శిస్తారు. ససత్సంబంధాలుకలిగి ఉంటారు. వీరు మేష ,సింహరాశులవారితో చక్కని సంబంధాలను కలిగి ఉంటారు.

గమనిక :  ధనస్సు రాశి లో జన్మించిన వారికి సాధారణంగా పై ఫలితాలు వర్తిస్తాయి.  మీ పూర్తి భవిష్యత్ ఫలితాలు దశా అంతర్దశ ఫలితాల కొరకు. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యను వ్రాసి మీ పూర్తి పేరు జన్మ తేదీ , జన్మ సమయం, జన్మ స్థలము, వివరములతో  సంప్రదించండి.  మీ మెయిల్ మరియు వాట్సాప్  ద్వారా  సంపూర్ణ జాతక పరిహార రిపోర్ట్ పొందండి