loading

కన్యారాశి జనన సాధారణ ఫలితాలు

  • Home
  • కన్యారాశి జనన సాధారణ ఫలితాలు

కన్యారాశి జనన సాధారణ ఫలితాలు  

ఆగష్ట్  24 నుండి సెప్టెంబర్  23 వరకు జన్మించిన వారు కన్యా రాశి జాతకులు

ఉత్తర 2,3,4 పాదాలు , హస్త 4 పాదాలు , చిత్త 1,2 పాదాలు  కన్య రాశి

కన్యా రాశివారు ధైర్యం సహజ గుణాలు కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం అధికం క్షమా గుణం కలవారు, చంచల మనస్కులు కష్టాలను ధైర్యంతో ఎదుర్కుంటారు. సౌందర్యోపాసకులు. వీరికి నీలం,గులాబీ , పచ్చ రంగులు మంచివి వీరికి జ్యోతిష్యం , హస్త సాముద్రికం , సనాతన వైదిక ధర్మకార్యాలు, ఆధ్యాత్మిక విద్యల్లో  ప్రవేశం ఉంటుంది. వీరు జ్యోతిష్య, పౌరోహిత్యం, సైన్స్ , గణితము ,బ్యాంకు , పుస్తక విక్రయం ,కంపెనీ అధికారి క్యాషియర్ ,టైపిష్టు వంటి రంగాలలో రాణిస్తారు. ఈ రాశివారికి నరాలు దెబ్బతినడం, టాన్సిల్స్ ,జలుబు , అండకోశాలు మొదలైన వాటితో బాధలు కలిగించును.

కన్యారాశి వారికి 15,24,33,42,51,60 సం||లు ఆధృష్ట ప్రదమైనవి 23,32,41,52 సం||లలో ఆకస్మిక ధన ప్రాప్తి కలిగించును. వీరు ఇత్తడి ,బంగారం, కర్పూరం, శంఖము ,పండ్లు దానము చేయుట వలన శుభములు కలుగును. వీరికి పచ్చ అనుకూలమైన రత్నము చిటికెన వ్రేలికి ధరించాలి. వీరికి నిజమైన మిత్రులు ఉండరు. వీరికి మిథునరాశి వారి భాగస్వామ్యం వలన మేలు కలుగుతుంది. ఈ రాశివారు తులసీమాల ధరించిన విఘ్నములు తొలగును. తులసి చెట్టును పూజచేసి అవుపాలను నైవేద్యంగా పెట్టడం వలన మనోవాంఛలు నెరవేరుతాయి. వీరికి బుధవారము విష్ణు , vవిఘ్నేశ్వర సంబంధ వ్రతములు చేయాలి.బుధ, గణేష్ యంత్రములు శుభములు కలిగించును. ఈ రాశివారికి దక్షిణ ,ఉత్తర దిశ స్థలాలు భూములు అనుకూలము సిమెంట్ లేదా తెలుపు రంగు మంచివి. నగంరానికి దక్షిణ భాగంలో నివసించరాదు.

ఈ రాశి మహిళలు భోగ విలాసాలకు ప్రాధాన్యత ఇస్తారు. వీరు కాత్యాయని పూజ చేయుట వలన శుభములు కలిగించును. ఈ రాశివారి భార్య అందమైనది. సహనవతి అన్నికార్యాలు నిర్వహించగలదు. ఈ కన్యా రాశి భూతత్త్వాన్ని కలిగి బుధ గ్రహముచేత పాలింపబడుతూ ఉంటుంది. ఈ రాశివారు సాధారణంగా పొడవుగా సుమారుగా 5.8 ఎత్తు, చూడ చక్కని శరీర నిర్మాణాన్ని కలిగి ఉంటారు. దట్టమైన చక్కని తీరైన కనుబొమ్మలు ఉంటాయి. నల్లని శిరోజాలు ,ఆకర్షణీయమైన  ముఖ వర్చస్సు కలిగి ఉంటారు.

వీరు ఒక ప్రత్యేక వ్యక్తిగా గోచరిస్తారు. పలురకాల అంశాలలో వీరికి అధికమైన పరిజ్ఞానం ఉంటుంది. వీరు నిజాయితీ , సున్నితత్వం ,పెద్దరికము ,స్వయం విజ్ఞానము అనేవి సహజంగా కలిగి ఉంటారు. వీరు ఏదైనా నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు పరిశీలన గావించి దానిలో ఏ దోషము లేకుండా జాగ్రత్త పడతారు. వీరు శ్రమించే తత్త్వము కలిగి ఉంటారు.వీరు ఎల్లప్పుడు ఆశావహ ధృక్పధం కలిగినవారు. వీరు తమ వృత్తి పట్ల అంకిత భావాన్ని కలిగి ఉంటారు. ఇతరుల పనులలో లోపాలను ఎట్టి చూపిస్తారు.

ఈ కన్యారాశి విద్యార్థినీ  మరియు  విధ్యార్థులు సాధారణ స్థాయికి చెందిన వారై ఉంటారు. వీరు అక్కౌంట్స్ వ్యాపార గణిత శాస్త్రము బ్యాంకింగ్ , పుస్తక సంరక్షణ ,ప్రింటింగ్ ఇంజనీరింగ్ ,సాంకేతిక టెక్నికల్ విద్యలలో ఆసక్తిని కలిగి ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో వీరిని అదృష్టవంతులుగానే పేర్కొన వచ్చు వీరు చక్కని వ్యాపార సంబంధ విజ్ఞానాన్ని కలిగి ఉండి ఇతరుల పట్ల విశ్వాసాన్ని కలుగజేసేవారిగా ఉంటారు. వీరు శ్రమించి సంపాదించే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఆర్థికపరంగా ఎన్నో రకాల ఎగుడు దిగుడులను కలిగిఉన్న వారియొక్క ప్రతిభ మరియు శ్రమచేసే ధోరణి వలన వెంటనే ఉన్నతస్థాయికి చేరుకోగలుగుతారు. వీరుచురుకైన వ్యాపార దక్షత కలిగి  పలుమార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. మరియు వీరు లాయర్లుగా విమర్శకులుగా ,కోశాగార సంరక్షకులుగా , గ్రంథాలయాధికారులుగా మనస్తత్వ శాస్త్రవేత్తలుగా ఉంటారు. వీరు సాధారణ జీవన శైలిని కొనసాగించేందుకే అధికంగా ఇష్టపడతారు.

ఈ రాశివారు క్రీడల పట్ల అభిమానులై ఉంటారు. వీరు తమ ఆహార విహారాల పట్ల ఆశ్రద్ధను కలిగి ఉండటం వలన అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. వీరు సహజంగా ఉదర సంబంధ సమస్యలచే అధికంగా బాధపడుతూ ఉంటారు. వీరు అత్యుత్తమమైన దానిని పొందేందుకు అధికమైన మక్కువను కలిగి ఉంటారు. వీరు ప్రేమ వివాహ అంశాలలో కూడా ఇదే విధమైన ధోరణిని ప్రదర్శిస్తారు. వీరు శారీరక అంద చందములతో పాటు విజ్ఞాన వివేకాలకూ  ప్రాధాన్యతలనిస్తారు. వీరు తమ భాగస్వామి పట్ల ఉదారస్వభావంతో మెలిగితే, వారికి ఇక జీవితమంతా స్వర్గతుల్యమవుతుంది. ఈ రాశివారికి వృషభ ,మకర రాశులతో సంబంధ బాంధవ్యాలు శుభ ప్రదంగా ఉంటాయి.

గమనిక : కన్య రాశి లో జన్మించిన వారికి సాధారణంగా పై ఫలితాలు వర్తిస్తాయి.  మీ పూర్తి భవిష్యత్ ఫలితాలు దశా అంతర్దశ ఫలితాల కొరకు. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యను వ్రాసి మీ పూర్తి పేరు జన్మ తేదీ , జన్మ సమయం, జన్మ స్థలము, వివరములతో  సంప్రదించండి.  మీ మెయిల్ మరియు వాట్సాప్  ద్వారా  సంపూర్ణ జాతక పరిహార రిపోర్ట్ పొందండి