loading

మిథున రాశిలో జనన సాధారణ ఫలితాలు

  • Home
  • మిథున రాశిలో జనన సాధారణ ఫలితాలు

మిథున రాశిలో జనన సాధారణ ఫలితాలు

మే 21 నుండి జూన్ 21 వరకు జన్మించినవారు మిథున రాశి జాతకులు

మృగశిర 3,4 వ పాదాలు , ఆరుద్ర 4 పాదాలు , పునర్వసు 1,2,3 పాదాలు  మిథున రాశి

మిథున రాశిలో జన్మించిన వారు ఎదుటివారి స్వభావాన్ని నైజాన్ని తేలిగ్గా గ్రహిస్తారు. వీరికి స్నేహ బృందం ఎక్కువ ఎంతటి కష్టాన్నైనా తేలిగ్గా భావిస్తారు. ఆకర్షిణీయమైన వ్యక్తిత్వం ,వాక్పటిమ , వినోద స్వభావం ఉంటుంది. వీరు ఆలోచనాపరులు ,సాత్విక ఆచరణ కలవారు. వీరికి వయస్సుతో నిమిత్తం లేకుండా శృంగార భావనలు అధికం . పరోపకారం ,దయగలవారు, బలవంతులు ,కోమలమైన శరీరం కలవారు కొన్ని సమయాల్లో ఒంటరితనాన్ని కోరుకుంటారు. విచారానికి , గోడవలకు దూరంగా ఉంటారు. ఈ రాశి జాతకుల అదృష్టం ఇతరుల మీద ఆధారపడి ఉంటుంది.

మిథున రాశి జాతకులకు 35 సం||ల వరకు ఆలోచనా స్థిరత్వం తక్కువ. వీరి జీవితంలో 25,30,31, 41,42 సం||ల యందు విశేష అదృష్టం కలుగుతుంది, ఈ రాశి జాతకుల  దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. పరోపకార స్వభావం అధికం. వృద్ధాప్యంలో సుఖ సౌఖ్యములు కలిగించును.

ఈ రాశివారు విద్యుత్ , జ్యోతిష్యం , వైదిక క్రతువులు, పత్రికా సంపాదకత్వం ,కమిషన్ ఏజన్సీ ,శాస్త్రవేత్త , పోష్టల్ సేవలు వంటి రంగములో రాణిస్తారు. ఈ రాశి జాతకులు అప్పులు ఎప్పుడు ఇవ్వకూడదు .

వీరికి అదృష్టం 21 సం||ల నుండి 32 సం||ల వరకూ చాలా నిదానంగా ప్రారంభమౌతుంది. 32,33,36,41,47,50, 54,55,56,61,63 సం||లు వీరికి కలసి వస్తాయి

ఈ రాశి వారికి పార్టనర్ షిప్ వ్యాపారం ఎక్కువకాలం కొనసాగించ రాదు. నమ్మించి మోసం చేస్తారు. జాగ్రత్త వహించాలి సమయ స్పూర్తితో వ్యవహరించాలి.

ఈ రాశివారికి తూర్పు ,పడమర దిశలు మీకు అనుకూలము లాభములు కలిగించును. వీరికి మేష, తుల, ధనస్సు, కుంభ, సింహ రాశుల వారు సహకారము ఇస్తారు.

ఈ రాశివారు కంచు ,నెయ్యి, శంఖం , ఆకుపచ్చ రంగు వస్త్రాలు , పెసలు లేదా పెసరపప్పు , అన్నదానము చేయుట వలన శుభాలు కలిగించును. వీరు పచ్చ రత్నమును ధరించాలి , పచ్చ , పసుపు, నీలం  రంగు దుస్తులు ధరిస్తే మంచిది.

ఈ రాశి స్త్రీలు  కోమలంగా నాజూకైన దేహం, చక్కని కళ్ళు ,ఎరుపు రంగు కలిగి ఉంటారు. వీరు త్వరగా స్పందిస్తారు. అందంతోనూ మిత్రత్వాన్ని కలిగి ఉంటారు. సంతానం ,భర్త పట్ల కర్తవ్య భావంతో ఉంటారు. పరోపకారులు ప్రసన్న చిత్తులుగా ఉంటారు.

ఈ రాశివారి భార్య గుణవతి, రూపవతి ,అందమైన శరీరం , మంచి గుణం కలిగిన వారు. ఈ రాశి గలవారు వాయు తత్వాన్ని కలిగి బుధ గ్రహముచే ప్రభావితము చేయబడుతూ ఉంటుంది.

ఈ రాశిలో జన్మించినవారు పొడవైన శరీరాన్ని కలిగి, పొడవైన చేతులు ,పలుచని కాళ్ళు చురుకైన పెద్ద దైన ముక్కుతో ఉంటారు. నుదుటిపై వాలుతున్నటువంటి శిరోజాలను కలిగి ఉంటారు. సాధారణంగా వీరు గోధుమ వర్ణపు ఛాయాతో ఉంటారు. విశాలమైన భుజాలను  కలిగి ఉంటారు. వీరు చతురత మరియు వివేకములకు పెట్టింది పేరు. ఉత్సాహ భరితంగా సరదాగా ఉత్తేజాన్ని కలిగించే వారై ఉంటారు. వీరికి చక్కని గ్రహణ శక్తి మరియు చురుకైన జ్ఞాపక శక్తి కుడా ఉంటుంది. వీరు దాయార్ద్ర హృదయులై , సంఘజీవులై సృజనాత్మక ఆశయాలతో నిండి ఉంటారు.

వీరు చురుకైన మరియు ఉల్లాసభరిత మనో ప్రవృత్తి కలిగిన వారై ఉంటారు. కొన్నిసార్లు వీరి యొక్క అయిష్టత నిరాసక్తతల వలన మంచి అవకాశాలను కోల్పోతూ ఉంటారు. వీరు తమరిదే సరిఅయిన నిర్ణయమని తమ మానసిక ప్రవృత్తిని మార్చుకోలేని వారై ఉంటారు.

వీరు మేధావులై , ఉత్తేజ పరచే వారై ఉంటారు. విశ్రాంతి లేకుండా అధికమైన శ్రమను చేయగలిగిన వారై ఉంటారు. వీరు భావాన్ని వ్యక్తం చేయటంలో తమదైన శైలిని కలిగి ఉంటారు. ఈ రాశివారు రచయిత గా వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశము ఉన్నది.

ఈ రాశి వారు ద్వైదీభావాన్ని కలిగి ఎల్లప్పుడూ నూతనత్వాన్ని కోరుకుంటారు. ఏదైనా ఒక విషయం బోర్ గా ఉంటే దానిని కొద్దికాలంపాటు వదిలేస్తారు

మిథున రాశివారు విద్యలో మంచి ప్రగతిని సాధిస్తారు. ఏ సబ్జెక్ట్ కు సంబంధించిన విషయాన్నైనా సులభంగా గ్రహిస్తారు. వీరికి భాషలయందు , వ్యాపార గణితము అకౌంట్ , న్యాయ శాస్త్రము మరియు పురావస్తు శాస్త్రాలపై మక్కువ అధికం

వీరు ఆర్థిక సంబంధ అవకాశాలను చక్కగా అందిపుచ్చుకొని తద్వారా లాభాలను పొందుతారు. వీరు చాలా తేలికగా ఆర్థిక ప్రగతిని సాధిస్తారు.

ఈ రాశివారు జీవితంలో ప్రతి దాన్ని పోరాటం ద్వారానే పొందుతారు. వీరు జీవితంలో అన్నిరకాల సౌఖ్యాలను అనుభవిస్తున్నప్పటికీ లోభ గుణము పిసినారితనము కలిగి ఉంటారు. వీరు భాగస్వామ్యము ద్వారా లేదా అధిక స్పెక్యులేషన్ వల్ల నష్టములను పొందుతారు.

ఈ రాశివారు జీవిత పయనంలో ఎత్తు పల్లాలను అధికంగా చూస్తారు. 32 సంవత్సరముల వయస్సు వరకు జీవితం వీరికి ఓ పోరాటంలా ఉంటుంది. 36 సం||ల దాటిన పిమ్మట స్థిరత్వము కలుగుతుంది. వీరు విద్య, పత్రికా రంగము అకౌంట్స్ , అమ్మకాలు ,రవాణా, న్యాయ సంబంధ ,ఫోటోగ్రఫీ, మరియు ఎగుమతి దిగుమతి , సాఫ్ట్ వేర్ , దేవాలయ అధికారులుగా సంపాదనా అవకాశాలు కలిగి ఉంటారు.

విరికి శాస్త్రీయ పరిశోధనలు , మానసిక శాస్త్రము , పరిశోధనాత్మక జర్నలిజం , ప్రచురణా రంగము మొదలైన వాటిలో మేధా శక్తి కలిగి ఉంటారు.

ఈ రాశివారు చురుకైన మానసిక స్థితిని కలిగి ఉంటారు. వీరికి చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు, ఊపిరితిత్తుల అసౌకర్యము ,క్షయ, మూత్రపిండాలలో రాళ్లు మొదలైన శారీరక అంగాలకు సంబంధించిన అంశాలలో అనారోగ్యము కలిగే అవకాశము ఉంటుంది.

వీరు సున్నితమైన నరముల వ్యవస్థ నాడీ మండలమునకు సంబంధించిన ఆరోగ్య విషయముపై ప్రత్యేక శ్రద్దను వహించాలి. ప్రతిరోజూ వ్యాయామము ,ధ్యానము మరియు  యోగాభ్యాసాలను చేయుట వలన స్వయం నియంత్రణ ఆందోళన వివిధ  సమస్యలను అధిగమించే శక్తి కలిగి మీకు మేలు కలిగించును.

ఈ రాశివారు చాలా త్వరితముగావృత్తి వ్యాపార వ్యవహారములయందు సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకుంటారు గాని వాటిని ఎక్కువకాలం కొనసాగించలేమని గ్రహిస్తారు. భాగస్వాముల యొక్క లోపాలను చాలా త్వరగా తెలుసుకుంటారు. వీరి అంచనాలకు అనుగుణంగా కనుక ఎదుటివారు ఉండక పోతే వారితో కలసి ఉండరు. వీరు శారీరకంగా ఉల్లాసంగా ప్రేమ భావాలను ఎక్కువగా కలిగి ఉంటారు. కానీ అసౌకర్యం అనేది వీరిని చాలా తేలికగా కుంగదీస్తుంది. ఈ రాశివారికి తుల , కుంభరాశుల వారు ఆత్మీయులై ఉంటారు.   

 గమనిక : మిథున రాశి లో జన్మించిన వారికి సాధారణంగా పై ఫలితాలు వర్తిస్తాయి.  మీ పూర్తి భవిష్యత్ ఫలితాలు దశా అంతర్దశ ఫలితాల కొరకు. మీకు ప్రస్తుతం ఉన్న సమస్యను వ్రాసి మీ పూర్తి పేరు జన్మ తేదీ , జన్మ సమయం, జన్మ స్థలము, వివరములతో  సంప్రదించండి.  మీ మెయిల్ మరియు వాట్సాప్  ద్వారా  సంపూర్ణ జాతక పరిహార రిపోర్ట్ పొందండి.