loading

మేష రాశి జనన సాధారణ ఫలితాలు

  • Home
  • మేష రాశి జనన సాధారణ ఫలితాలు

మేష రాశి జనన సాధారణ ఫలితాలు

మార్చి 21 నుండి ఏప్రియల్ 20 లోపుగా పుట్టినవారు మేషరాశిగా పరిగణించ బడతారు.

అశ్విని 4 పాదాలు , భరణి 4 పాదాలు , కృత్తిక 1 వ పాదము  మేషరాశి

మేష రాశి అధిపతి కుజుడు ఈ కుజ గ్రహము నవగ్రహలలో సేనాపతిగా యుద్ద వీరునిగా ,శస్త్ర విద్యలో నిపుణుడి గా చెప్పబడుతుంది. ఈ రాశివారు శ్రమించి ఫలితాలను పొందుతారు.

రాశులలో మొదటిది ఈ మేష రాశి ఇది కుజుని చే పరిపాలించబడుతూ, అతని అధిపత్యంలో వుండి  తీక్షణమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మిగిలిన ఇతర రాశుల కంటే కూడా అధిక శక్తివంతమైన  వాటిలో ఒకటిగా పేర్కొన బడుతుంది .

ఈ రాశియందు జన్మించిన స్త్రీ పురుషులు మధ్యస్థ మైన శారీరక నిర్మాణా కృతిని కలిగి ఉంటారు. ఆకర్షణీయ లక్షణాలతో ను  ప్రతిబింబిస్తూ , సూటిగా ఉండే ధృక్కులను, తీరైన టువంటి ముక్కు ,ఎర్రని రంగుతో చక్కని ఆకర్షణీయమైన శరీర ఛాయను, ఉల్లాస వంతమైన లక్షణాలను కలిగి ఉంటారు. సాధారణంగా వీరు  అగ్ని తత్వాన్ని కలిగిన వారుగా ఆత్మ విశ్వాసము  స్వయం ప్రేరణా శక్తిని కలిగి ధైర్య సాహసాలు మరియు నిశ్శబ్ద మనో వైఖరులను కలిగి ఉంటారు. వీరు నూతనమైన ఆశయాలు దృక్పథం కలిగి ఉండి వాటిని త్వరగా ఆచరణలో పెట్టె స్వభావులై ఉంటారు. ఈ రాశి వారు తమ ఆశయ సాధనకై విశ్రాంతి లేకుండా శ్రమించుట వలన తరచుగా అసహనానికి గురి అవుతారు.

ఈ రాశి వారు పోటీ నిమిత్తం తీవ్రంగా  కృషి చేస్తారు. వీరు వారి యొక్క అధికారము ,పేరు ప్రతిష్టలు ,మరియు వైభవముల పట్ల స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారు. జీవితంలో అనుభవాన్ని వృద్ధి చేసుకోవటానికై ఆతృత పడుతూ ఉంటారు. శక్తి వంతము సృజనాత్మకత , క్రమశిక్షణ , విశ్వాసము మరియు నిర్ణయాలను చేసే శక్తులు పొంది ఉంటారు. శిరస్సును పైకెత్తు కొని , నడక యందు  వేగాన్ని ప్రదర్శిస్తూ సంచరిస్తారు . వీరు విశాల హృదయులు , గర్వము దూరదృష్టి మరియు సున్నితత్వము కలిగి ఉంటారు.

ఈ రాశి జాతకులు  జీవితము సుఖము లేదా కష్టములతో ఉండేందుకు ఆస్కారము ఉన్నది. వీరు తప్పు చేయడాన్ని (తామైనసరే ) అసహ్యించుకునే స్వభావం కలిగి ఉంటారు. వీరు హాస్య ప్రియత్వమును కలిగి ఉన్నతమైన ఆశావాహ దృక్పథాన్ని కలిగి ఉంటారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితి నైనా ఏదుర్కొనే  ధైర్యాన్ని సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.

ఈ రాశి జాతకులకు ఆసక్తిదాయకమైన విషయాలు మరియు వ్యవహారమునందు ఇతరులతో రాజీ పడేందుకు అంగీకరించరు. వీరు తమ అసహనము, కోపము ,చిరాకులను నీయంత్రించుకొన్నచో   శత్రువులపై నిశ్శబ్ద విజయమును సాధించగలరు.  వీరు ధనవంతులు అయ్యే అవకాశము ఉన్నాయి.

మేష రాశి జాతకులకు  అశుభ పాప గ్రహాల ప్రభావంగా కలహాన్ని తగాదాలు  కోరు మనస్తత్వాన్ని అధికంగా కలిగి ఉంటారు. అశుభ గ్రహ ప్రభావం వారిని మూర్ఖ స్వభావము ,అహంకారము ,తీవ్రత మొదలైన చెడు గుణాలు కలుగుటకు అవకాశము ఉన్నది.

ఈ రాశివారు విద్య విషయకంగా అమితమైన మేధా శక్తిని  కలిగి ఉండి ఎటువంటి విషయాన్నైనా ఇట్టే గ్రహిస్తారు. భాషలు ,చరిత్ర , టెక్నాలజి ,మెకానికల్ వ్యవసాయ అనుబంధ విద్యలలో  మరియు న్యాయ శాస్త్రములు వీరికి అభిమాన విద్య సంబంధ అంశాలు.   

వీరికి మొండితనం కోపం అధికం , అనుకున్న పనులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా  ఉంటాయి. రహస్య శత్రువుల వలన పనులకు ఆటంకం ఏర్పడి మధ్యలోనే ఆ పనులను వదిలేస్తారు. ఈ రాశి జాతకులు అధికారాన్ని కాపాడుకుంటారు.

మేష రాశి స్త్రీ /పురుషులకు  చంచల స్వభావం ఒకప్పుడు ఉత్సాహంతో మరొకప్పుడు విచారంతో ఉంటారు. తాము ఆశించిన రీతిలో ఎదుటి వారు ఉండనిచో వారిపట్ల వ్యతిరేకంగా ఆలోచిస్తారు. వీరు దేని వలన కూడా ప్రభావితులు కారు. ప్రభావితమైతే అందరిపై కరుణ దయ కలిగి ఉంటారు.  వీరికి రేడియో, టీవీ , కరెంట్ , రాగి, ధాతు సంబంధ క్రియలు మందులు, హోటల్లు , రేష్టారెంట్స్ , వ్యవసాయం పూలతోటలు , ఫర్నీచర్, మిల్లులు కర్మాగారముల యందు మొదలైన కార్యాలు చేస్తే లాభాలను పొందుతారు.

మేష రాశి జాతకులకు  28 సంవత్సరముల తరువాత అదృష్టం ప్రారంభమౌతుంది. వీరికి తూర్పు దిక్కు అత్యంత అనుకూలము వీరికి 16,18,25,27,30,34,43,49,51,54,63 సంవత్సరములు శుభములు కలిగించును ఈ రాశి జాతకులు నెయ్యి ,శంఖం , ఇత్తడి వస్తువులు ,బంగారం ,కర్పూరం, పండ్లు వంటివి దానము చేయుట వలన శుభములు కలిగించును. ఈ రాశివారికి తూర్పు ,ఉత్తరం దిశలు కలిగిన గృహములు అనుకూలము కానీ నగరానికి ఉత్తర భాగములో నివాసము ఉండరాదు.

మేష రాశి జాతకులు తేట రంగు , మంచి స్వభావం అందం కలిగి ఉంటారు. గుండ్రని అందమైన నేత్రములు కలిగి ఉంటారు. స్వాభిమానం అధికము సేవాభిలాషులు ,  స్త్రీలు అందమైన శరీరం కలిగి భర్తతో చాలా ప్రేమగా ఉంటారు, పురుషులు భార్యతో ప్రేమ ఆప్యాయతలు కనబరుస్తారు. గురు జనుల సేవ చేసే వారిగా ఉంటారు. గుప్తా రోగములతో  బాధ పడతారు. ఈ రాశి జాతకులకు 3 వ సంవత్సరములో కుక్క లేదా ,కోతుల వలన గాయం కలుగును 30 సం||లో ప్రమాదము లేదా దుర్ఘటనకు గురి అవుతారు.

మేష రాశివారు పగడం ధరించాలి . నారింజ ,ఆకుపచ్చ, పసుపు రంగులు వీరికి మంచిని కలిగిస్తాయి.

ఈ రాశి జాతకులు జీవిత భాగస్వామిని ఎన్నుకొనేటప్పుడు , మేష, కర్కాటక, సింహ, తుల ,ధనస్సు వారిని  ఎన్నుకోవాలి

మేష రాశివారు ప్రణాళికలను రచించి తమ కోసం గాక ఇతరుల కోసం బాగా అమలు చేయగలుగుతారు. వీరు త్వర త్వరగా భాగ్యవంతులయ్యే అవకాశాలు లభిస్తాయి. వీరు పెట్టుబడులు ,పరిశ్రమల వ్యాపారము ద్వారా అధికముగా ధనార్జన చేస్తారు. వీరు పొదుపు మరియు వ్యయములపై  నియంత్రణ పాటించిన శ్రేయస్సులు ఉన్నత స్థితి కలిగించును.

ఈ రాశి జాతకులు మనో విశ్లేషణా నైపుణ్యులుగా , న్యూరో సర్జన్ గా , రసాయన శాస్త్రవేత్తలుగా, చలన చిత్ర నటులుగా ,క్రిమినల్ లాయర్లుగా , విమాన ఫైలట్లుగా ,ఆటోమొబైల్ ఇంజనీర్లుగా, కార్పెంటర్లుగా ,పాకశాస్త్ర ప్రవీణులుగా, మెకానిక్ గా ,బాక్సింగ్ , క్రీడా వస్తువులు విక్రయించే వారుగా  మొదలైన వివిధ రంగాలను వృత్తులుగా కలిగి ఉంటారు. వీరికి శాస్త్రీయ దృక్పథము వలన వారు పరిశోధన పరమైన కార్యక్రమాలను సమర్థవంతముగా నిర్వహించ గలరు. క్రీడా నైపుణ్యము వీరికి సహజంగా లభించే అదృష్టము, సనాతన ధర్మ రంగములలో ప్రవేశము ఉండును . ఈ రాశి స్త్రీలకు పొడవైన శిరోజాలను కలిగి ఉంటారు.

సహజంగా ఈ రాశివారు మంచి ధృఢమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి ఆహార నియంత్రణ లేకపోవటం వలన  ఉదర సంబంధమైన పలు ఇబ్బందులకు గురిచేస్తుంది. వీరు శిరోవేదన ,జ్వరములు , మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడుట , నిద్రలేనితనము, రక్త చాపము వంటి అనారోగ్యాల బారిన పడే అవకాశాలున్నాయి. వీరు వాహనాన్ని నడిపేటప్పుడు మిక్కిలి జాగ్రత్తవహించాలి. మనో విశ్రాంతిని పొందుట అనే ఈ నియమాలను పాటించిన శుభప్రదముగా ఉండును.

ఈ రాశివారు చాలా ఆకర్షణీయంగా  కళా కాంతులతో మరియు సత్ప్రవర్తనను కలిగి ఉండి ఎల్లప్పుడు ఇతర జాతి పురుషులైనచో  స్త్రీల చేత, స్త్రీలైన చో పురుషుల చేత ఆకర్షించబడతారు. భౌతికపరమైన ఆనందాలకు ,సుఖాలకు ప్రాధాన్యతలను అధికంగా ఇస్తారు. వ్యక్తిగతమైన భావ ప్రదర్శనలకు ప్రాధాన్యతలనీయక  వివేకము ,మేధా శక్తి ,మరియు విజయములకు  అధికంగా స్పందిస్తారు. వీరికి కర్కాటక, కన్య, తుల, వృశ్చిక, మరియు మకర రాశుల వారి నుంచి ఇబ్బందులు అధికంగా ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ సంబంధమైన విషయాలలో వీరియొక్క తీవ్రమైన ప్రవర్తన మూలంగా వీరు ఆనందాతిరేకాలను కోల్పోయే ప్రమాదం కూడా ఉండవచ్చు

గమనిక : మేష రాశి లో జన్మించిన వారికి సాధారణంగా పై ఫలితాలు వర్తిస్తాయి.  మీ పూర్తి భవిష్యత్  ఫలితాలు దశా అంతర్దశ ఫలితాల కొరకు మీకు ఉన్న ప్రస్తుత ఉన్న సమస్యను వ్రాసి మీ పూర్తి పేరు జన్మ తేదీ , జన్మ సమయం, జన్మ స్థలము, వివరములతో  సంప్రదించండి.  మీ మెయిల్ మరియు వాట్సాప్  ద్వారా  సంపూర్ణ జాతక పరిహార రిపోర్ట్ పొందండి.